రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం గొల్లపల్లి లోని జయ హాస్పిటల్, మల్టి స్పెషాలిటీ,డెంటల్ కేర్ ఆసుపత్రిలో ఆదివారం ఉచిత కన్సల్టేషన్,ఉచిత వైద్య పరీక్షల క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్ జయశ్రీ , బానోతు కవితలు తెలిపారు.ఈ క్యాంపులో ఎముకల సంబంధిత వ్యాధులకు సిరిసిల్ల కు చెందిన డాక్టర్ “అన్నం సాధన” ఏం.
ఎస్ ఆర్థో సర్జన్ గారు రోగులకు ఫ్రీ కన్సల్టేషన్, ఉచితంగా పరీక్షలు నిర్వహించారు,
అలాగే చెవి,ముక్కు,గొంతు సంబంధిత వ్యాధులకు సంబంధించి సిరిసిల్ల నుండి డాక్టర్ మోహన్ కృష్ణ, కూడా ఫ్రీ కన్సల్టేషన్, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారని డాక్టర్ జయశ్రీ తెలిపారు.ఆర్థో, ఈ.ఎన్.టి వైద్యులు ప్రతినెల శుక్రవారం రోజున గొల్లపల్లిలోని జయ హాస్పిటల్ లో మిగిలిన రోజుల్లో సిరిసిల్లలోని శ్రీకృష్ణ హాస్పిటల్లో (రుచి హోటల్ వెనకాల) అందుబాటులో ఉంటారని తెలిపారు.నేడు సుమారు 50 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు అందించారని తెలిపారు.