నువ్వుల నూనె( Sesame Oil ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.నువ్వుల నుంచి తయారు అయ్యే నూనె ఇది.
ఖరీదు కోంచెం ఎక్కువే అయినప్పటికీ.దాని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలా మంది వంటల్లో నువ్వుల నూనెనే ఉపయోగిస్తారు.
నువ్వుల నూనెలో విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా నిండి ఉంటాయి.అందువల్ల ఈ నూనె ఆహారాన్ని రుచికరంగా చేయడానికి మాత్రమే కాకుండా ఆయుర్వేద వైద్యంలోనూ ఉపయోగపడుతుంది.
అలాగే నువ్వుల నూనెతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.అందులో మంచి నిద్ర( Good Sleep ) ఒకటి.
ఇటీవల రోజుల్లో ఎంతో మందిని కలవరపెడుతున్న సమస్య నిద్రలేమి.నిద్ర పట్టకపోవడం లేదా సంతృప్తికరమైన నిద్ర పొందలేకపోవడాన్నే నిద్రలేమి( Insomnia ) అంటారు.కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల శరీరకంగా, మానసికంగా బలహీనపడతారు.తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
అయితే నిద్రలేమి సమస్యను తగ్గించడానికి మరియు మంచి నిద్రను ప్రోత్సహించడానికి నువ్వుల నూనె అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
ఇలా వేడి చేసిన నువ్వుల నూనెను గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.ఈ విధంగా చేయడం వల్ల నువ్వుల నూనెలో ఉండే నేచురల్ ఫ్యాటీ ఆమ్లాలు మరియు విటమిన్ ఇ నాడీ వ్యవస్థను ప్రశాంతంగా మారుస్తాయి.ఒత్తిడి, మానసిక ఆందోళనను దూరం చేస్తాయి.నిద్ర సమస్యలను దూరం చేస్తాయి.మంచి నిద్రను కలిగిస్తాయి.
అలాగే నిద్రకు ముందు పాదాలకు గోరు వెచ్చని నువ్వుల నూనె రాసి మసాజ్ చేసుకోండి.ఇలా చేయడం శరీరానికి ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది.శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
మంచి నిద్రను ప్రమోట్ చేస్తుంది.కాబట్టి, నిద్రలేమితో బాధపడుతున్నవారు తప్పకుండా నువ్వుల నూనెను ఉపయోగించండి.