జైపూర్‌లో( Jaipur ) ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.ఇండియాలో ఐఏఎస్‌లకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు కానీ ఇటీవల 75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై( Retired IAS Officer ) ఓ బస్సు కండక్టర్( Bus Conductor ) చేయి చేసుకున్నాడు.
కేవలం పది రూపాయల ఎక్స్‌ట్రా ఛార్జీ ఇవ్వలేదన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఆదివారం పోలీసులు ఈ వివరాలను వెల్లడించడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే, ఆర్ఎల్ మీనా అనే ఆ ఐఏఎస్ అధికారి శుక్రవారం ఆగ్రా( Agra ) రోడ్డులో ఉన్న కనోటాకు వెళ్లే బస్సు ఎక్కారు.
అయితే కండక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆయన వెళ్లాల్సిన బస్టాప్ రాకుండా బస్సు ముందుకు వెళ్లిపోయింది.దీంతో ఆయన దిగాల్సిన స్టాప్ మిస్సయ్యారు.ఆ తర్వాత బస్సు నయ్లా చేరుకుంది.అప్పుడు కండక్టర్ మీనాను అదనంగా ప్రయాణించిన దూరానికి గాను రూ.710 ఇవ్వాలని డిమాండ్ చేశాడు.దీనికి మీనా ఒప్పుకోలేదు.
అక్కడితో మొదలైన వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది.మాటా మాటా పెరిగిపోవడంతో ఆగ్రహించిన కండక్టర్ మీనాను( Meena ) తోసేశాడు.
దీంతో మీనా కూడా కండక్టర్‌పై చేయి చేసుకున్నారు.ఆ తర్వాత కండక్టర్ రెచ్చిపోయి మీనాపై దాడి చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన 44 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులో కండక్టర్ ఆ వృద్ధుడిపై పదే పదే పిడిగుద్దులు కురిపిస్తున్న విజువల్స్ క్లియర్‌గా మనం చూడవచ్చు.మిగతా ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.చివరికి మీనా విసిగిపోయి బస్సు దిగి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై కనోటా పోలీస్ స్టేషన్ అధికారి ఉదయ్ సింగ్ స్పందించారు.కండక్టర్‌ను ఘనశ్యామ్ శర్మగా గుర్తించామని తెలిపారు.బాధితుడు ఆర్ఎల్ మీనా శనివారం ఫిర్యాదు చేశారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.మరోవైపు జైపూర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ స్పందిస్తూ కండక్టర్‌ను సస్పెండ్ చేసింది.
పోలీసుల విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ షాకింగ్ ఘటనతో ప్రయాణికుల భద్రత, ప్రజా రవాణా సిబ్బంది ప్రవర్తనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.