రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ ను ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం పరిశీలించారు.ఎల్లారెడ్డిపేట మండలం నుండి గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరుకు వెళ్లే తొమ్మిదవ ప్యాకేజీ కెనాల్ ను పరిశీలించారు.
మిడ్ మానేరు నుండి మల్కపేట రిజర్వాయర్ కు పంపింగ్ ద్వారా వచ్చే నీటి పైపులను కూడా పరిశీలించారు.అనంతరం మలకపేట రిజర్వాయర్ కట్టపై నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్నారు.
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మాజీ సర్పంచ్ దేవేందర్ యాదవ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిండే శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్ని బాబు ఉన్నారు.