పాకిస్తాన్ లోని( Pakistan ) పంజాబ్ లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది.ఆరుగురు సోదరులు ఆరుగురు సోదరీమణులను వివాహం చేసుకోవడం బహుశా ప్రపంచంలో మొట్టమొదటిసారి జరిగి ఉండవచ్చు.
గ్రూప్ మ్యారేజ్( Group Marriage ) ద్వారా ఈ ఆరు జంటలు తమ వివాహాలను చాలా సరళంగా నిర్వహించడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఆదా చేసుకున్నారు.ఇకపోతే, ఆరుగురు సోదరులు( Six Brothers ) తమ వివాహం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
వీరి పెద్ద అన్నయ్య తన పెళ్లి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసే పరిస్థితి వచ్చింది.ఎందుకంటే, ఒకే ఇంట్లో ఆరుగురు సోదరీమణులు( Six Sisters ) కలసి ఉండడం అరుదైన విషయం.
కొన్ని సందర్భాలలో వివాహా సంబంధాలు వయసు సమస్యల కారణంగా లేదా ఇతర కుటుంబ పరిస్థితుల వల్ల రద్దు కావడం జరిగింది.అయితే, అదృష్టవశాత్తూ ఒకే ఇంట్లో ఆరుగురు సోదరీమణులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం వల్ల, ఆరుగురు సోదరులు ఒకే కుటుంబంతో సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు.అయితే ఆరుగురు అమ్మాయిలు మాత్రం ఇలా ఒకే ఇంటి అబ్బాయిలను వివాహం చేసుకుంటారని ఎప్పుడు అనుకోలేదట.ఈ ఆరు జంటల వివాహం చాలా సాధారణంగా జరిగింది.
పెద్దగా ఆహ్వానాలు లేకుండా, కేవలం 100 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.ఈ ఆరు పెళ్లిళ్ల కార్యక్రమానికి కేవలం 1 లక్ష పాకిస్థానీ రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని సమాచారం.అదనంగా, వధువుల కుటుంబంపై ఆర్థిక భారం వేయకూడదని నిర్ణయించుకొని, కట్నం వంటి అనవసర సంప్రదాయాలను పూర్తిగా వదిలేశారు.గ్రూప్ మ్యారేజ్ నిర్వహించడం ద్వారా ఈ జంటలు వివాహానికి సంబంధించిన అన్ని ఖర్చులను పంచుకున్నారు.
ఇది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, సామాజికంగా సానుకూల సందేశాన్ని ఇచ్చినట్లు అయింది.ఈ ఆరు జంటల ప్రత్యేకమైన వివాహం పాకిస్థాన్లో మాత్రమే కాకుండా, ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.