ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?

ప్రస్తుత రోజులలో మనిషికి మనిషి సహాయం చేయడం మానేసి ఇంకా పక్కవారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు.ఎవరికైనా సహాయం అవసరం ఉందన్న కానీ వారి ఊసు లేకుండా వారి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు.

 Instead Of Helping Injured Truck Driver People Looted Video Viral Details, Human-TeluguStop.com

ఇక కొన్ని సందర్భాలలో అయితే.ఎదుటివారి ప్రాణాలు పోతున్నా సరే పట్టించుకోకుండా ఉన్న జనాలు చాలామంది ఉన్నారు.

అచ్చం అలాంటి సంఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో( Karnataka ) చోటు చేసుకుంది.కళ్ళ ముందు ఎదుటి మనిషి ప్రాణం పోతున్నా కానీ అక్కడ ఉన్నవారు వేడుక చూసినట్లు చూశారే కానీ అతడిని కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టింది.వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా ఒక ట్రక్కు ప్రమాదానికి గురైంది.ఈ క్రమంలో డ్రైవర్( Driver ) క్యాబిన్ లో ఇరుక్కుపోయి అక్కడి నుంచి బయటికి రాలేక అనేక ఇబ్బందులు పడుతూ తీవ్ర గాయాలతో రక్షించండి అంటూ కేకలు వేస్తూ ఉన్నాడు.ఇక ప్రమాదాన్ని గమనించిన అక్కడి స్థానికులు ట్రక్కు వద్దకు వచ్చారు గాని.

అతడిని కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు.

పైగా ఇంజన్ ముందువైపు ఉన్న ఆ డ్రైవర్ పర్సు, ఫోను, తదితర వస్తువులను తీసుకున్నారే తప్ప అతడిని కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు.దీంతో ఆ డ్రైవర్ ఎటువంటి సహాయం పొందలేకపోయి నిరుత్సహస్థితిలో అలాగే ఉండిపోయాడు.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ.“మానవత్వం ఎక్కడికి దిగజారుతుందో కూడా అర్థం కావడం లేదు” అని కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు ” డ్రైవర్ ను కాపాడేది పోయి ఇలా వస్తువులు ఎత్తకపోవడం ఏంటి” అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube