హ్యాండ్‌స్టాండ్ ట్రిక్‌తో కళ్లముందే మాయం.. ఇదెలా చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు!

ప్రస్తుతం సోషల్ మీడియా యూజర్లను ఒక వీడియో షేర్ చేసేస్తోంది.రెండున్నర కోట్లకు పైగా వ్యూస్ వచ్చిన ఆ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డుపై మాయాజాలం( Magic ) చేశాడు.

 Viral Video Man Pulls Off Stunning Handstand Illusion Details, Camouflage, Hands-TeluguStop.com

కళ్లముందే జరుగుతున్నా నమ్మశక్యం కాని ఈ ట్రిక్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.చుట్టూ ఉన్న ప్రపంచంతో అతను కలిసిపోయిన తీరు అద్భుతం.

వైరల్ వీడియోలో( Viral Video ) రద్దీగా ఉన్న రోడ్డు మీద జీన్స్, టీ-షర్ట్ వేసుకున్న ఒక సాధారణ వ్యక్తి కనిపిస్తాడు.అతను ఎర్ర బస్సు వెనుక నిలబడ్డాడు.

అంతా సవ్యంగానే ఉంది అనుకునేలోపే ఒక్కసారిగా హ్యాండ్‌స్టాండ్( Handstand ) తో శరీరాన్ని వింతగా వంచాడు.కెమెరా పక్కనుంచి తిరిగేసరికి మ్యాజిక్ స్టార్ట్ అయింది.

అతని దుస్తులు( Costumes ) బస్సు రంగుల్లో, డిజైన్‌లో ఉండటంతో… ముందు నుంచి చూస్తే మనిషే లేడు, బస్సుతో కలిసిపోయాడు, ఇది నిజంగా జరుగుతోందా అనిపిస్తుంది.కళ్లముందే ఉన్న మనిషి కళ్లు మూసి తెరిచేలోపు వీధి, బస్సు పరిసరాల్లో అదృశ్యమైనట్లు ఆప్టికల్ ఇల్యూజన్ కల్పించడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.

అందుకే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది.“ఇది నిజమా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఒకరు “నమ్మలేకపోతున్నా!” అంటే, ఇంకొకరు “చూడకుండా ఎవరైనా గుద్దేస్తే?” అని భయపడుతున్నారు.ఇంకొందరైతే “ఆశ్చర్యపోవాలో, భయపడాలో తెలియట్లేదు” అంటున్నారు.

కాస్ట్యూమ్ కోసం ఇతడు ఎంత కష్టపడ్డాడో, ఈ ఐడియా వెనుక ఎంత శ్రమ ఉందో అని మరి కొంతమంది సలోచనగా కామెంట్లు పెడుతున్నారు.

కొందరు ఇది ఎడిటింగ్ ట్రిక్ అని వాదిస్తున్నారు.“గ్రీన్ స్క్రీన్ వాడారేమో, బ్యాక్‌గ్రౌండ్‌తో కలిపేశారేమో” అని అనుమానిస్తున్నారు.ఏది నిజమైనా, ఈ వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నిజం ఏదైనా, ఈ వీడియో క్రియేటివిటీకి, టెక్నిక్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! కళ్లు చెదిరే ఈ ట్రిక్ నెటిజన్లను కట్టిపడేస్తోంది.మీరు కూడా దీన్ని ఒకసారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube