రాజన్న సిరిసిల్ల జిల్లా: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకొన్న సిరిసిల్ల పట్టణ ,టాస్క్ఫోర్స్ పోలీసులు.05 గురు నిందుతులు అరెస్ట్,వివిధ రకాల నకిలీ డాక్యుమెంట్లు, స్టాంప్ లు, సెల్ ఫోన్లు,డాక్యుమెంట్లు తయారీ చేసే సామగ్రి స్వాధీనం.సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివారలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
నిందుతుల వివరాలు:
1.సిరిపురం చంద్ర మౌళి, తండ్రి: రాజయ్య, 61y,వృత్తి: రిటైర్డ్ టీచర్,గాంధీనగర్, సిరిసిల్ల.2.పోలు ప్రకాష్, తండ్రి: లక్ష్మి రాజాం, 55y,వృత్తి: ప్రింటింగ్ వర్క్ , సాయినగర్, సిరిసిల్ల.3.బొడ్డు శివాజీ@ శివ తండ్రి: ఎల్లయ్య, 43y, వృత్తి: డాక్యుమెంట్ రైటర్, r/o శివనగర్ సిరిసిల్ల,4.చిలుక బాబు తండ్రి: లక్ష్మీనారాయణ, 45y,వృత్తి: వ్యవసాయం,r/o అనంతపల్లి గ్రామం,చందుర్తి మండలం.5.బిట్ల విష్ణు అడ్వకేట్.6 శిలం రాజేష్, తండ్రి : వెంకటనర్సయ్య.(పరారీలో ఉన్నాడు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో నకిలీ సూరిటీ సర్టిఫికెట్ పెట్టుకొని రిమాండ్ అయిన కేసులో బెయిల్ వచ్చేలా చేయగా దానిపై విచారణ చేయగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గాంధీనగర్ కి చెందిన సిరిపురం చంద్రమౌళి రిటైర్డ్ టీచర్ కొన్ని నకిలీ స్టాంపుల ( mro బోయినపల్లి, సివిల్ అసిస్టెంట్ సర్జన్,గ్రామ పంచాయతీ సెక్రటరీ పేరుతో ,కొంత మంది vip ల etc.) పేరుతో ప్రభుత్వ ఆఫీసుల నుండి జారీ చేసే సర్టిఫికెట్లు,కోర్టులో బెయిల్ కొరకు సూరిటీగా ఇచ్చే ప్రాపర్టీ వాల్యూయేషన్ సర్టిఫికెట్లు, ప్రభుత్వ ఆఫీసుల నుండి ఇచ్చే age సర్టిఫికెట్లు, ప్రభుత్వ స్కూళ్లలో నుండి ఇచ్చే డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు,ఆసుపత్రుల నుండే ఇచ్చే వివిద మెడికల్ సర్టిఫికెట్లు,కల్యాణ లక్ష్మి పొందడానికి నకిలీ అర్హత పత్రాలు, విఐపి లు ఇచ్చే లెటర్ ప్యాడ్ లు,అర్హత లేని వారికి మరియు సంబంధిత పత్రాలను సమర్పించలేని వారికి పై ఆఫీసులలో నుండి సర్టిఫికెట్లు పొందలేని వారికి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వాటిని సంబదిత ప్రభుత్వ ఆఫీసులలో సమర్పించి ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేస్తున్నరాని తేలియగ చంద్ర మౌళి ని అదుపులోకి తీసుకని విచారించగా ప్రకాష్, శివాజీ,రాజేష్ సహకరిస్తున్నారని,చందుర్తి మండలం,ఆనంతపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ వీరి వద్ద నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్ పొంది లబ్ధి పొందారని,విష్ణు అనే వ్యక్తి వీరి వద్ద నకిలీ వాల్యువేషన్ సర్టిఫికెట్ తీసుకొని ఇతరులకు ఇవ్వడం జరిగిందన్నారు.ఇట్టి కేసుపై లోతుగా విచారం చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.పై నిందుతులలో 05గురిని ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.
నిందితుల వద్ద నుండి స్వాదీన పరుచుకొన్న వాటి వివరాలు:
06 స్టాంపులు (GOVT JR COLLEGE, MALLIAL, DIST.JAGITYAL స్టాంప్ (1),CIVIL ASSISTANT SURGEON, DIST HOSPITAL SIRCILLA, 505301, RAJANNA SIRCILLA DIST స్టాంప్(1), TAHSILDAR BOINPALLI స్టాంప్ (1), GEZETTED HEAD MASTER, GOVT HIGH SCHOOL KORUTLA, DIST: JAGITHYAL స్టాంప్ (1), GEZETTED HEAD MASTER, GOVT HIGH SCHOOL METPALLI , DIST: JAGITHYAL స్టాంప్ (1)], నకిలీ డాక్యుమెంట్ లు[1సిరిసిల్ల Tahasidar స్టాంపులు కలిగిన కుటుంబ సబ్యుల దృవీకరణ పత్రం, (2).Boinpalli Tahasidar స్టాంపులు,ఇంటి విలువ గల దృవీకరణ పత్రాలు కాలివి మొత్తం 11] ,పెన్నులు(6), భూతద్దం(1), సెల్ ఫోన్ లు (4) స్టాంప్ పాడ్స్(2),పాలీ స్టాంపర్ స్టాంపులు తయారు చేసే మిషన్ (1), స్టాంపు ముట్టీలు (31), రెండు వైపుల అంటించే స్టాంప్ షీట్లు (2),సిలికాన్ షీట్ (1),ఒక స్టాంప్ సొల్యూషన్ కెమికల్ గల నలుపు రంగు డబ్బా.
ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ, టాస్క్ఫోర్స్ సి.ఐ సదన్ కుమార్,టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.







