కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి మనందరికీ తెలిసిందే.సుదీప్( Sudeep ) ప్రస్తుతం వర్షంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే తాజాగా మాక్స్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు సుదీప్.తాజాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏంటి? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అన్న వివరాల్లోకి వెళితే.
కథ
:
ఇందులో అర్జున్ అలియాస్ (సుదీప్) పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారు.సస్పెన్షన్ లో ఉన్న సీఐ మరో పోలీస్ స్టేషన్ ని ట్రాన్స్ ఫర్ అవుతాడు.
అలా సస్పెన్షన్ నుంచి డ్యూటీ లోకి ఎక్కే ఒక్క రాత్రి లోనే ఊహించిన విధంగా ఎన్నో ఘటనలు జరుగుతాయి.ఇక పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టక ముందు మంత్రుల కొడుకుల్ని అరెస్ట్ చేసి లోపల వేస్తాడు అర్జున్.
ఇప్పటికే ఆ మంత్రులు ఇద్దరూ కూడా సీఎంని దించేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు.పోలీస్ స్టేషన్ లోనే ఆ ఇద్దరు ఆకతాయిలు చనిపోతారు. ఆ మినిస్టర్ కొడుకులు ఎలా చనిపోతారు? ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? ఈ కథలో క్రైమ్ ఇన్ స్పెక్టర్ రూపా (వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్ స్టర్ గని (సునిల్) పాత్రలు ఏంటి? చివరకు మాక్స్ తన తోటి ఉద్యోగుల్ని కాపాడేందుకు ఏం చేస్తాడు? ఆ కేసు వ్యవహారం నుంచి ఎలా బయటపడతాడు? ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమాలో పోలీస్ స్టేషన్ లో జరిగే డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.కామెడీ అలాగే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయి.కేవలం ఒక చిన్న లైన్ తో సినిమా కథను బాగా రూపొందించారు డైరెక్టర్.
చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ డైరెక్టర్ ని మెచ్చుకోకుండా ఉండలేరు.ఇక మాస్ ఆడియెన్స్‌కు( mass audience ) నచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి.
థ్రిల్లింగ్ మూమెంట్స్ కావాలని అనుకునే ఆడియెన్స్‌కి అవి కూడా ఉంటాయి.కొన్ని చిన్న ట్విస్టులు ఉంటాయి.
ఆడియెన్స్ ఊహించే ట్విస్ట్‌కి భిన్నంగానూ ఆ ట్విస్టులు ఉంటాయి.సోషల్ మెసెజ్ కూడా ఉంటుంది.
అలా అన్ని రకాలు మాక్స్ మూవీని డైరెక్టర్ పకడ్బందీగా రాసుకున్నాడని చెప్పాలి.సినిమాలో ఇంటర్వెల్ సీను అలాగే క్లైమాక్స్ సినిమాకు బాగా హైప్ ని క్రియేట్ చేసాయి.
నటీనటుల పనితీరు:
సినిమా ప్రారంభంలోనే హీరో ఎంట్రీ సీన్ అదిరిపోతుంది.హీరో కిచ్చా సుదీప్ ఇందులో ఎప్పటిలాగా బాగానే నటించారు.ఒకరకంగా చెప్పాలంటే సుదీప్ తన పాత్రలో ఒదిగిపోయాడని చెప్పవచ్చు.యాక్షన్ హీరోగా మరోసారి తన సత్తాను చాటుకున్నాడు.ఆ కటౌట్ ను వాడుకుంటే ఎలా ఉంటుందో చూపించాడు.యాక్షన్ సీక్వెన్స్ అయితే ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లానే ఉంటుంది.
అన్యాయాన్ని సహించని పోలీస్ ఆఫీసర్ గా కిచ్చా సుదీప్ అదరగొట్టేశాడు.ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ ( Varalakshmi Sarath Kumar )పాత్రకు తగిన ప్రాధాన్యత అయితే ఉంది.
వరలక్ష్మీ తన నటనతో ఆడియెన్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.సునీల్ పాత్ర మరీ రెగ్యులర్ అయిపోయిందనే భావన కలుగుతుంది.
మిగిలిన నటినటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత :
మాటలు బాగుంటాయి.పాటలు కూడా బాగానే ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించుకుంది.
సినిమాను చాలా రిచ్‌గా, గ్రాండియర్ గా తీసినట్టు అర్థమవుతుంది.కెమెరా వర్క్స్ బాగానే ఉన్నాయి.
రేటింగ్ :
3/5