సోనూసూద్.( Sonu Sood ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఇంకొక వైపు మంచి మంచి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు.కరోనా సమయం నుంచి సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టిన సోనూసూద్ ఇప్పటికీ కూడా సేవలు చేస్తూనే ఉన్నారు.
సమయం దొరికినప్పుడల్లా తన గొప్ప మనసును చాటుకుంటూనే ఉన్నారు.ఇప్పటికే కొన్ని వేలాదిమందికి అండగా నిలిచి సహాయం చేసిన విషయం తెలిసిందే.
సినిమాల్లో విలన్ క్యారెక్టర్లలో నటించినప్పటికీ రియల్ లైఫ్ లో హీరో( Real Life Hero ) అనిపించుకున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు.తన కొత్త సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ మొత్తాన్ని ఒక వృద్ధాశ్రమానికి, అనాథ శరణాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.ఇప్పుడు తన ఫతే సినిమా( Fateh Movie ) కలెక్షన్లను కూడా ఒక మంచి పనికి వినియోగించేందుకు రెడీ అయ్యారు.
ఫతే చిత్రానికి సోనూసూద్ స్వయంగా దర్శకత్వం వహించారు.డైరెక్టర్ గా ఇది అతని డెబ్యూ మూవీ.సైబర్ క్రైమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సోనూసూద్.సైబర్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
కోవిడ్( Covid ) సమయంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది.ఫతే సినిమాలో సోనూసూద్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కూడా నటించారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.సోనూసూద్ భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.దేశ ప్రజల కోసం ఈ సినిమా చేశాము.ఈ సినిమా కలెక్షన్ల సొమ్మును వృద్ధాశ్రమాలు,( Oldage Homes ) అనాథ శరణాలయాలకు( Orphan Homes ) పంపించే ప్రయత్నం చేస్తాము అని ఈ సినిమా ప్రమోషన్లలో సోనూసూద్ తెలిపారు.
దీంతో ఆయన గొప్ప మనసుకీ అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.సోనూసూద్ గారిని ఎంత పొగిడినా తక్కువే అంటూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.