రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన ఈశ్వరాలయంలో శుక్రవారం కన్నుల పండుగ గా అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు రాచర్ల హనుమాన్ల శర్మ, వైదిక నిర్వహణ బ్రహ్మశ్రీ వేలేటి పనింద్ర శర్మ, రాచర్ల దాయనంద్ శర్మ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.వేద పటణం గణపతి పూజ పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన,యతీలభ్య ప్రాసన,దీక్షాదౄరణ,నవగ్రహ యోగిని వాస్తు, క్షేత్రపాలక సర్వతో భద్ర మంటపారాధన, అగ్ని ప్రతిష్ట అవహిత దేవతా హవనం నీరాజనం కార్యక్రమాలు జరిగాయి.
సాయంత్రం ప్రదోషకాలపూజ, మూల మంత్ర హవనం, జలాదివాసం, రాజోపచారాలు మంగళహారతి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తుకోటికి ఆలయ అర్చకులు రాచర్ల హనుమాన్ల శర్మ తీర్థ ప్రసాద వితరణ చేశారు.
ఈనెల 15వ తేదీ ఆదివారం ఉదయం 4:10 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట, ఉదయం 8 50 నిమిషములకు ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట మహోత్సవం జరుపబడును.ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన అల్లం రాజం సులోచన దంపతులు తమ స్వంత ఖర్చులతో ఆలయంలోని బోరుబావికి మోటర్ అందజేశారు వారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బొమ్మ కంటి శ్రీనివాసు గుప్తా, బొమ్మ కంటి రవీందర్ గుప్తా , నంది కిషన్, బోమ్మకంటి రాజయ్య గుప్తా గంప నాగేంద్రం గుప్తా, శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్ , సనుగుల ఈశ్వర్,శ్రీ లక్ష్మీ కేశవ పెరుమళ్ళ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు పారి పెళ్లి రాంరెడ్డి, రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి,బండారి బాల్ రెడ్డి, బచ్చు పెద్ద మల్లేశం గుప్తా, పుల్లయ్యగారి తిరుపతి గౌడ్, రావుల ముత్యం రెడ్డి, బొండుగుల మార్కండేయ గుప్తా, గాజుల దాసు, పబ్బా శేఖరం గుప్తా,నవ్వోత్ రాము గుప్తా, తోట బాలయ్య గుప్తా, దీటీ నర్సయ్య శంకర్ ,గోదా గోష్టి మహిళా భక్త బృందం తదితరులు పాల్గొని ఈశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు.