సాయికుమార్( Saikumar ) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ప్రణయ గోదారి.( Pranaya Godari Movie ) ఈ మూవీలో సదన్,( Sadan ) ప్రియాంక ప్రసాద్( Priyanka Prasad ) జంటగా నటించారు.
పృథ్వీ, జబర్దస్త్ రాజమౌళి, సునీల్ రవినూతల, ప్రభావతి, మిర్చి మాధవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.పీఎల్వీ క్రియేషన్స్ పతాకంపై వీఎల్ విగ్నేష్ ఈ సినిమాను నిర్మించారు.ఇకపోతే తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి? ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్న వివరాల్లోకి వెళితే.
కథ :
గోదారికి చెందిన పెదకాపు(సాయి కుమార్) వెయ్యి ఎకరాల ఆసామి.చుట్టూ ఉన్న 40 గ్రామాలకు ఆయనే పెద్ద.ప్రేమ వివాహం చేసుకున్న పెదకాపు చెల్లి భర్త చనిపోవడంతో కొడుకు శ్రీను(సదన్ హాసన్)తో కలిసి అన్నయ్య దగ్గరకు వస్తుంది.
తన కూతురు లలిత(ఉష శ్రీ)ని మేనల్లుడు శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు పెదకాపు.కానీ శ్రీను ఆ ఊరి జాలరి అమ్మాయి గొయ్య లక్ష్మి ప్రసన్న అలియాస్ గొయ్యని (ప్రియాంక ప్రసాద్)ఇష్టపడతాడు.
గోచిగాడు(సునీల్)తో కలిసి రోజు గోదారి ఒడ్డుకు వెళ్లి గొయ్యని తరచుగా కలుస్తుంటాడు.అయితే వీరిద్దరీ ప్రేమ వ్యవహారం పెద కాపుకు తెలుస్తుంది.ఆ తర్వాత ఏం జరిగింది పెదకాపు వీరిద్దరికీ పెళ్లి చేశారా? మేనల్లుడు ప్రేమను అంగీకరించాడా లేదా? చివరికి ఏం జరిగింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఇదివరకే పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.ఈ ప్రణయ గోదావరి సినిమా కూడా ఆకోవకే చెందినదే అయినప్పటికీ దర్శకుడు కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.అయితే ఈ సినిమాను దర్శకుడు తెరపై చూపించే విషయంలో కొద్ది మేరకు మాత్రమే సఫలమయ్యారని చెప్పాలి.
మూవీ ప్రారంభం రొటీన్‌గా ఉన్నా, ప్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత కథ పై ఆసక్తి పెరుగుతుంది.గొయ్యతో శ్రీను ప్రేమలో పడడం తన ప్రేమ విషయాన్ని చెప్పడం శ్రీను చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
మధ్య మధ్యలో సునీల్( Suneel ) చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.సినిమాలో ఫస్ట్ ఆఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
ఇంటర్వెల్ సీన్ తర్వాత ట్విస్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ ప్రేక్షకులలో పెరుగుతూనే ఉంటుంది.
నటీనటుల పనితీరు :
ఇకపోతే ఈ సినిమాలో నటీనటులు ఏ మేరకు మెప్పించారు అన్న విషయానికి వస్తే.ఎప్పటిలాగే సాయికుమార్ తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించారు.సదన్, ప్రియాంక ప్రసాద్ కొత్తవాళ్లే అయినప్పటికీ చాలా చక్కగా నటించారు.సిటీ యువకుడు, పల్లెటూరి అబ్బాయిగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించిన సదన్ ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి బాగా ఆకట్టుకున్నాడు.
ఇక గొయ్యగా ప్రియాంక తెరపై అందంగా కనిపించింది.వీరిద్దరూ కూడా వారి హావ భావాలతో ప్రేక్షకులను బాగా మెప్పించారు.పెదకాపు పాత్రలో సాయికుమార్ జీవించేసాడని చెప్పాలి.ఆయన పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
గోచి పాత్ర కూడా హైలెట్ అని చెప్పాలి.పాత్రలో సునీల్ ఒదిగిపోవడంతో పాటు తన కామెడీతో కూడా బాగా మెప్పించారు.
అలాగే సినిమాలో మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత :
సినిమాలో కెమెరా వర్క్స్ బాగానే ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది.ఈ సినిమాకు పాటలు ప్రధాన బలం అని చెప్పాలి.
పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి.అలాగే సినిమా నేపథ్య సంగీతం కూడా పరవాలేదు.
సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.పల్లెటూరి వాతావరణం గోదావరి అందాలను చాలా చక్కగా తెరపై చూపించారు.ఎడిటింగ్ పర్వాలేదు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.