సూర్యాపేట జిల్లా:మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో మహిళ సమాఖ్య పరిధిలో 28 లక్షల రూపాయలకు పైగా సంఘాల సొమ్ము పక్కదారి పట్టిన కుంభకోణం ఆలస్యంగా వెలుగు చూసింది.సంఘ సభ్యులకు తెలియకుండా కాజేయడం జరిగిందని, స్త్రీనిధి’ రుణాలు దారి మళ్లించడం,సభ్యులు చెల్లించే బకాయిలను బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకోవడం,పొదుపు సొమ్ము సైతం మింగేయడం అలా కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
సంఘాల్లో లెక్కలు తేల్చగా 28 లక్షలకు పైగా స్వాహా చేసినట్లు అక్రమాలు వెలుగుచూశాయి.మహిళ సంఘ బంధంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మద్దిరాల మండల కేంద్రంలో వెలుగు ఆఫీస్ ముందు మహిళ సంఘ బంధం సభ్యులు ధర్నా నిర్వహించడంతో పరిస్థితి వెలుగులోకి వచ్చింది.
గోరంట్ల వివోఏ -2,మహిళ సంఘాల డబ్బులు సుమారు 28 లక్షలు,కాజేశారని,ఈ అవినీతి, అక్రమాలలో మండల అధికారుల భాగస్వామ్యం కూడా ఉందని,ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అవినీతికి పాల్పడిన వివోఏ గోరంట్ల -2 పైన,వారికి సహకరించిన మండలాధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి సొమ్ము దాచుకొని పొదుపు చేసుకున్న డబ్బులు రికవరీ చేయాలని కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు పాల్వాయి కవిత,తాటిపాముల ధనమ్మ, జలగం అనిత,కోల మంజుల, పొన్నం రమ తదితరులు పాల్గొన్నారు.