క్లిష్ట సమయంలో పెదనాన్న అండగా నిలిచారు.. నారా రోహిత్ కామెంట్స్ వైరల్!

తాజాగా టాలీవుడ్ నటుడు నారా రోహిత్( Nara Rohith ) తండ్రి రామ్మూర్తి నాయుడు( Ramurthy Naidu ) మరణించిన విషయం తెలిసిందే.అనారోగ్యాల కారణంగా ఆయన తాజాగా శనివారం రోజు మరణించడంతో నిన్న ఆదివారం రోజున ఆయన అంత్యక్రియలు ముగిసాయి.

 We Deeply Moved By Your Love And Support Says Nara Rohith Details, Nara Rohith,-TeluguStop.com

ఆత్మీయులు రాజకీయ నాయకులు పలువురు సెలబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించారు.ఇక తండ్రి మరణ వార్తను కొడుకు నారా రోహిత్ తట్టుకోలేకపోతున్నారు.

Telugu Brahmini, Chandra Babu, Chandrababu, Lokesh, Rohit, Rohith, Ramurthy, Tol

ఇప్పటికే తండ్రి గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నారా రోహిత్ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, తన పెదనాన్న నారా చంద్రబాబు నాయుడుతో( Nara Chandrababu Naidu ) పాటు ఆత్మీయులు, సన్నిహితులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టారు.తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు రోహిత్.క్లిష్ట సమయంలో పెదనాన్న, పెద్దమ్మ ఎంతో సపోర్ట్‌ చేశారని అన్నారు.తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ విలువైన మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి.

Telugu Brahmini, Chandra Babu, Chandrababu, Lokesh, Rohit, Rohith, Ramurthy, Tol

ఈ సమయంలో మాకు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.ముఖ్యంగా అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్‌ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు నారా లోహిత్.ఈ సందర్భంగా నారా రోహిత్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆ పోస్టులపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.నారా రోహిత్ కు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube