వైరల్ వీడియో: స్కూటీపై వెళ్తూ బస్సు కింద పడ్డ యువతి.. స్పాట్‌డెడ్..

వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటుగా వెళ్లాలనుకోవడం ప్రమాదకరం.

 Viral Video: Young Girl Who Fell Under The Bus While Riding A Scooty.. Spotted..-TeluguStop.com

తొందరగా ఇంటికి వెళ్లాలని ఉద్దేశంతో ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) పాటించకపోతే ప్రాణాలు పోవచ్చు.లేదంటే శాశ్వతంగా దివ్యాంగులు అవ్వచ్చు.

అందుకే కొన్ని నిమిషాల పాటు లేట్ అయినా సరే సురక్షితంగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం.ఈ విషయాన్ని పోలీస్ అధికారులు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు.

అయినా సరే కొందరు తప్పులు చేస్తుంటారు.ఇటీవల ఒక యువతి స్కూటీపై వెళుతూ రోడ్డు క్రాస్ చేయడంలో తప్పు చేసింది.

ఆమె వెనకా ముందూ చూసుకోకుండా రోడ్డుపైకి దూసుకొచ్చింది.అదే సమయంలో వేగంగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు (Private bus)ఆమెను బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే చనిపోయింది.

నెల్లై జిల్లా రామాయనపట్టి(Nellai District Ramayanapatti) సమీపంలోని వేప్పంకులం గ్రామానికి చెందిన సెల్వం అని తెలిసింది.

ఈ యువతి వయసు కేవలం 19 ఏళ్లే.ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతోంది.

గురువారం ఉదయం ఒక ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో మృతి చెందింది.పెరుమల్పురంలోని ఒక కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న సెల్వం, తన స్కూటీపై రోడ్డు దాటే ప్రయత్నంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

రామాయనపట్టి (Ramayanapatti)సమీపంలోని ఒక ఇరుకైన రోడ్డును దాటుతుండగా, వేగంగా దూసుకొచ్చిన బస్సు ఆమెను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ప్రమాదం మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, స్కూటీపై రోడ్డు దాటే ప్రయత్నంలో ఉన్న సెల్వంను వేగంగా వస్తున్న బస్సు ఢీకొట్టడం చూడవచ్చు.ఈ దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి.ఈ ఘటన రోడ్డు భద్రతపై ప్రజల్లో ఆందోళన కలిగించింది.

అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఎంతటి విషాదం జరుగుతుందో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.

ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు(police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను(Bus driver) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ ఘటన, రోడ్డు ప్రమాదాలను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాలనే అవసరాన్ని ఎంతగానో తెలియజేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube