రాబిన్ హుడ్ టీజర్ రివ్యూ.. ఆ ఒక్క డైలాగ్ తో సినిమాపై అంచనాలు పెరిగాయిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో 100% సక్సెస్ ఉన్న ఉన్న డైరెక్టర్లు ఎవరనే ప్రశ్నకు రాజమౌళి, ప్రశాంత్ వర్మ, అనిల్ రావిపూడి, ప్రశాంత్ నీల్ తో పాటు వెంకీ కుడుముల( Venky Kudumula ) కూడా ఉన్నారని చెప్పవచ్చు.ఛలో, భీష్మ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాతో( Robinhood Movie ) అంతకు మించి మ్యాజిక్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 Nithin Robinhood Movie Teaser Review Details, Nithin , Robinhood Movie, Robinhoo-TeluguStop.com
Telugu Venky Kudumula, Sreeleela, Nithin, Robinhood-Movie

రాబిన్ హుడ్ టీజర్ కు( Robinhood Teaser ) అరగంటలోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.టీజర్ లో వేర్వేరు గెటప్ లలో నితిన్( Nithin ) కనిపించగా శ్రీలీల( Sreeleela ) క్యూట్ లుక్స్ తో కనిపించారు.యు బ్లడీ ఫారెనర్స్ అంటూ నితిన్ టీజర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.పోలీస్ నువ్వు అరబ్ వా అని అడగగా నితిన్ నై అని సమాధానం చెబుతాడు.

మరి అరబ్ షేక్ గెటప్ లో ఎందుకు ఉన్నావ్ అని అడగగా ఆవిడ పంజాబీనా మరి పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంది అనే డైలాగ్ పేలింది.

Telugu Venky Kudumula, Sreeleela, Nithin, Robinhood-Movie

రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.మొదట డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందని మొదట ప్రకటించినా పుష్ప ది రూల్ మూవీకి ఇబ్బంది లేకుండా ఈ సినిమాను ఐదు రోజుల పాటు వాయిదా వేశారని సమాచారం అందుతోంది.డిసెంబర్ లో పుష్ప ది రూల్, రాబిన్ హుడ్ సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Telugu Venky Kudumula, Sreeleela, Nithin, Robinhood-Movie

రాబిన్ హుడ్ సినిమా సక్సెస్ సాధించడం నితిన్ కెరీర్ కు సైతం కీలకమని చెప్పవచ్చు.అయితే వెంకీ కుడుముల మార్క్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.రాబిన్ హుడ్ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.మైత్రీ బ్యానర్ రేంజ్ ను ఈ సినిమా పెంచుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube