ఆరో తరగతిలో 5 లక్షల ఫండ్.. ఆ ఘటనతో ఐఏఎస్... అశోక్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

బాల్యం నుంచి మనం ఎలాంటి అలవాట్లను కలిగి ఉంటామో ఆ అలవాట్లే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయని చెప్పవచ్చు.ఐఏఎస్ ఆఫీసర్ మయూర్ అశోక్( IAS Mayur Ashok ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు ఎంతోమందికి తమ బాల్యాన్ని గుర్తు చేస్తుంది.

 Ias Mayur Ashok Inspirational Success Story Details, Ias Mayur Ashok, Ias Mayur-TeluguStop.com

ప్రస్తుతం మయూర్ అశోక్ జాయింట్ కలెక్టర్ గా( Joint Collector ) పని చేస్తున్నారు.తన స్వస్థలం మహారాష్ట్రలోని బీడ్ అని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Civils, Ias Mayur Ashok, Iasmayur, Ias, Mayuk Ashok-Inspirational Storys

గుజరాత్ లో భుజ్ లో భారీ భూకంపం వచ్చిన సమయంలో ఫండ్ కలెక్ట్ చేయడానికి టీమ్ లీడర్ గా నన్ను ఎంపిక చేశారని అప్పట్లోనే 5 లక్షల రూపాయల ఫండ్ కలెక్ట్ చేశామని ఆ సమయంలో నన్ను టీచర్లు అభినందించారని అశోక్ పేర్కొన్నారు.ఆ 5 లక్షలను కలెక్టర్ ను ఇచ్చే బాధ్యతను నాకు అప్పగించారని ఆ సమయంలో ఐఏఎస్ అధికారి ఎలా ఉంటారో చూసి నేను కూడా ఐఏఎస్ కావాలని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Civils, Ias Mayur Ashok, Iasmayur, Ias, Mayuk Ashok-Inspirational Storys

ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశానని ఎం.ఏ అడ్మినిస్ట్రేషన్ కూడా చదివానని ఆయన పేర్కొన్నారు.2018 సంవత్సరంలో సివిల్స్ కు( Civils ) ఎంపికై నా కలను నేను నెరవెర్చుకున్నానని అశోక్ వెల్లడించారు.ప్రతి ఒక్కరి బాల్యం మనకు కథ అవుతుందని భావి తరాలకు చరిత్ర అవుతుందని అశోక్ పేర్కొన్నారు.

చిల్డ్రన్స్ డే రోజున ఏదో ఒక గేమ్ లో ఫ్రైజులు వచ్చేవని అశోక్ తెలిపారు.

ఒకటో తరగతిలో చదివే సమయంలో స్వాతంత్ర సమరయోధుల వేషధారణలపై పోటీలను నిర్వహించారని నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెటప్ లో వెళ్లి డైలాగ్స్ చెప్పానని ఆ సమయంలో నాకే ఫస్ట్ ఫ్రైజ్ వచ్చిందని ఆయన తెలిపారు.

అశోక్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అశోక్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube