జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారా సత్యశ్రీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సత్యశ్రీ( Satyashri ) కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఈ మధ్య కాలంలో పలు సినిమాలలో సైతం నటించిన సత్యశ్రీ తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టీవీ షోలతో పాటు ఈవెంట్లలో సైతం మెరుస్తున్న సత్యశ్రీ పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది.
అయితే తాజాగా సత్యశ్రీ సొంతింటి కలను నిజం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.సొంతూరు తణుకులో( Tanuku ) సత్యశ్రీ సొంతిల్లు కట్టుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నెటిజన్లు సైతం సత్యశ్రీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సొంతిల్లు కట్టుకోవడం తన కల అని నా సొంతూరు తణుకులో సొంతిల్లు అంటూ సత్యశ్రీ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

సత్యశ్రీకి ఇన్ స్టాగ్రామ్ లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి సత్యశ్రీ ఇష్టపడతారు.కొత్త ఇల్లు కొత్త ప్రారంభం కొత్త జ్ఞాపకాలు అంటూ సత్యశ్రీ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సత్యశ్రీకి పలువురు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు.
సత్యశ్రీ ఎంచుకునే రోల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సత్యశ్రీ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో ఇష్టం లేకుండానే కానిస్టేబుల్ రోల్ లో నటించానని చెప్పుకొచ్చారు.సత్యశ్రీ ఎంతో కష్టపడటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.చమ్మక్ చంద్ర సత్యశ్రీ కాంబినేశన్ లో వచ్చిన స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.
సత్యశ్రీ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.కామెడీ ప్రధాన పాత్రలను ఎంచుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంది.







