జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకు నటించిన యమదొంగ సినిమాలోని ఓ డైలాగ్ ఇప్పటికి అందరికీ గుర్తుండే ఉంటుంది.అందులో రౌడీలను తరుముతూ హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఓ డైలాగ్ చెప్పారు.
పులిని దూరం నుంచి చూడాలనిపించిందని అనుకో చూడు.అదే పులితో ఫోటో దిగాలి అనిపించిందనుకో కాస్త రిస్క్ అయిన పర్లేదు ట్రై చేసుకోవచ్చు.
సరే కదా చనువు ఇచ్చిందని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇకపోతే ఎవరికైనా వన్య ప్రాణులైన పులులు, సింహాలు(Tigers, lions) ఇంకా మరికొన్ని జంతువులను కేవలం దూరం నుంచి చూడాలి మాత్రం తప్ప వాటి దగ్గరికి వెళ్లి వారిని పలకరించి ఆడుకునే ధైర్యసాహసాలు చేయడం మానుకోవడం మంచిది.
అయితే తాజాగా.ఓ అమ్మాయి ఒకేసారి నాలుగు పుల్లలతో కలిసి బెడ్డుపై ఆడుకుంటున్న వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.ఇక వైరల్ గా మారిన వీడియోను చూస్తే.

ఆ వీడియోలో నాలుగు పులులు ఓ అమ్మాయి ఉండడం మనం గమనించవచ్చు.యువతి చుట్టూ అచ్చం పెంపుడు కుక్కలు ఎలా మన చుట్టూ తిరుగుతాయో అలాగే ఆ మహిళ చుట్టూ నాలుగు పులులు(Four tigers) తిరగడం మనం చూడవచ్చు.ఇక ఇంత ధైర్యంగా పులులను తన మీదికి ఎక్కించుకుంటూ తనతో పాటు సేద తీరేందుకు ఇష్టపడుతున్న మహిళ ఎవరో కాదు.
ఆమె ఫ్రెయా ఆస్పినాల్.ఆవిడ పులుల బ్రిటిష్ సంరక్షకురాలు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు.అనేకమంది వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఎంత సంరక్షకురాలు అయినా సరే పులులు వాటి స్వభావం చూపిస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందే అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో ఆమె పులులపై చూపించిన కేరింగును ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు.







