ప్రస్తుత వింటర్ సీజన్ లో బద్ధకం తారాస్థాయిలో ఉంటుంది.చలిపులి కారణంగా ఉదయం త్వరగా లేవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
అలాగే వ్యాయామం విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తుంటారు.ఫలితంగా బరువు నిర్వహణలో విఫలం అవుతుంటారు.
కానీ ఇకపై మీకు ఆ టెన్షన్ అక్కర్లేదు.వింటర్ లో రోజు ఉదయం ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ వాటర్ ను తాగితే వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.
ఇంతకీ ఆ మిరాకిల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసుకోవాలి.
అలాగే పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు(teaspoon of organic turmeric), చిటికెడు మిరియాల పొడి మరియు గ్లాస్ నిండేలా హాట్ వాటర్ పోసి బాగా మిక్స్ చేస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.ఈ టర్మరిక్ ఘీ వాటర్ చలికాలంలో హెల్త్ కి చాలా మేలు చేస్తుంది.
ముఖ్యంగా జీవక్రియ రేటును పెంచుతుంది.ఇది శరీరంలో కేలరీలు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
అలాగే నెయ్యి, పసుపు.ఇవి రెండూ ఆర్థరైటిస్ మరియు ఇతర పరిస్థితులకు సహాయపడే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.టర్మరిక్ ఘీ వాటర్ (Turmeric Ghee Water_ను నిత్యం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులకు దూరంగా ఉండవచ్చు.
ఈ వాటర్ ఆరోగ్యకరమైన గట్ ను ప్రోత్సహిస్తుంది.పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి (Bloating, gas, indigestion)వంటి సమస్యలను తగ్గిస్తాయి.
టర్మరిక్ ఘీ వాటర్ ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పని చేస్తుంది.ప్రతి రోజూ ఉదయం ఈ వాటర్ తాగితే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లతో పోరాడే సామర్థం లభిస్తుంది.అంతేకాకుండా ఈ మిరాకిల్ వాటర్ ఒత్తిడిని చిత్తు చేస్తుంది.మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.మెదడు చురుగ్గా పని చేసేలా ప్రోత్సహిస్తుంది.
పైగా నెయ్యి మరియు పసుపు చర్మానికి మెరుపును ఇస్తాయి.మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను దూరం చేస్తాయి.