ఒంట్లో సత్తువ పెంచే జ్యూస్ ఇది.. రోజు ఉదయం తాగితే మీకు తిరుగేలేదు!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు.ఇప్పటి కాలంలో రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటం అనేది గగనం అయిపోయింది.

 This Is A Juice That Increases Energy In The Body Details, Beetroot Papaya Straw-TeluguStop.com

కొందరైతే మధ్యాహ్నానికే నీరసంగా మారిపోతుంటారు.అయితే ఒంట్లో సత్తువను పెంచడానికి, మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడానికి ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది.

రోజు ఉదయం ఈ జ్యూస్ తాగితే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.

Telugu Beetroot, Beetrootpapaya, Tips, Healthy, Latest, Papaya, Strawberry-Telug

జ్యూస్ తయారీ కోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక చిన్న కప్పు బీట్ రూట్ ముక్కలు,( Beet Root ) అర కప్పు స్ట్రాబెర్రీ ముక్కలు,( Strawberry ) అర కప్పు బొప్పాయి ముక్కలు వేసుకోవాలి.అలాగే ఐదు నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం గింజ‌లు( Almonds ) మరియు ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో బీట్ రూట్ పపాయ స్ట్రాబెర్రీ జ్యూస్ అనేది రెడీ అవుతుంది.

ఈ జ్యూస్ సూపర్ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.

Telugu Beetroot, Beetrootpapaya, Tips, Healthy, Latest, Papaya, Strawberry-Telug

ప్రధానంగా బొప్పాయి స్ట్రాబెర్రీ మరియు బీట్ రూట్ లో ఉండే పోషకాలు బాడీని ఎనర్జిటిక్ గా( Energitic ) మారుస్తాయి.రోజంతా ఉత్సాహంగా ఉండడానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయి.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.

అలాగే ఈ బీట్ రూట్ పపాయ స్ట్రాబెర్రీ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కంటి మరియు హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

ఈ టేస్టీ జ్యూస్ కాలేయ ఆరోగ్యానికి మరియు నిర్విషీకరణకు మద్దతు ఇస్తుంది.

రక్తహీనతతో బాధపడుతున్న వారు నిత్యం ఈ జ్యూస్ ను తాగితే శరీరానికి పుష్కలంగా ఐరన్ అందుతుంది.రక్తహీనత దూరం అవుతుంది.

అంతేకాకుండా ఈ హెల్తీ జ్యూస్‌లోని నైట్రేట్లు మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి, ఇది అభిజ్ఞా పనితీరును పెంచుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube