జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు( Deputy CM Pawan Kalyan ) ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.దీంతో క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి( Delhi ) బయలుదేరి వెళ్ళనున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో( Amit Shah ) ప్రత్యేకంగా భేటీ కానున్నారు.దీంతో పవన్ ను ఢిల్లీ పెద్దలు ఎందుకు పిలిచారు ? కారణం ఏమిటి అనే దాని పైన ఆసక్తి నెలకొంది.ఇటీవల కాలంలో పవన్ ప్రతి విషయం పైన తీవ్రంగా స్పందిస్తున్నారు.తమ ప్రభుత్వం తీరు పైన చురకలు అంటిస్తున్నారు.ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై కొద్ది రోజులు క్రితం పిఠాపురంలో జరిగిన సమావేశంలోనే పవన్ తీవ్రంగా స్పందించారు.
తానే హోం మంత్రిగా ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవి అంటూ పరోక్షంగా పోలీసుల తీరు సక్రమంగా లేదనే విధంగా మాట్లాడారు. ఈ వ్యవహారం తరువాత టిడిపి( TDP ) కూడా పవన్ వ్యాఖ్యలపై లో లోపల ఆగ్రహంతో ఉండడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇది వైసిపికి అనుకూలంగా మారిందనే వార్తలు వినిపించాయి.
ఇక ఈ వ్యవహారంపై జాతీయ మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేసింది.కూటమి మధ్య అప్పుడే విభేదాలు వచ్చాయని, ఓ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసాధారణమని, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీల మధ్య గ్యాప్ లేదని అనుకోలేమని జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేసిన నేపథ్యంలో,
ఢిల్లీకి రావాల్సిందిగా పవన్ కు అమిత్ సూచించడంతో పవన్ ఢిల్లీలో అమిత్ షా తో ఏం మాట్లాడబోతున్నారు ? వీరిద్దరి మధ్య ఏ ఏ విషయాలపై చర్చ జరుగుతుందనేది రాజకీయంగా ఆసక్తి నెలకొంది. వాస్తవంగా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయంపై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు అందుతూ ఉంటాయి .అదే కాకుండా కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా కు ఈ విషయాలపై పూర్తి అవగాహన ఉంటుంది.2027 లోని జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధం అవుతుండడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీలో తమ కూటమి ప్రభుత్వంపైనే పరోక్షంగా విమర్శలు చేయడం వంటి పరిణామాలు నేపథ్యంలో అమిత్ షా పవన్ తో ఏ ఏ అంశాలపై చర్చిస్తారు అనేది టిడిపి పెద్దలకు మరింత ఉత్కంఠ కలిగిస్తోంది.