పాలు.( Milk ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అలాగే సౌందర్య సాధనంగా కూడా పాలు ఉపయోగపడతాయి.ముఖ్యంగా ప్రస్తుత వింటర్ సీజన్ లో( Winter Season ) ఇప్పుడు చెప్పబోయే మిల్క్ మాస్కులను ప్రయత్నిస్తే మీ స్కిన్ స్మూత్ అండ్ షైనీ గా మెరిసిపోవడం ఖాయం.
టిప్-1:
ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) చిటికెడు కుంకుమ పువ్వు మరియు చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
ఆపై 20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ మాస్క్ డ్రై స్కిన్ ను రిపేర్ చేస్తుంది.చర్మానికి తేమను అందిస్తుంది.స్కిన్ స్మూత్ అండ్ షైనీగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
టిప్ 2:
ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి,( Sandalwood Powder ) రెండు టేబుల్ స్పూన్లు పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.పాలల్లో ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.చందనం పొడి స్కిన్ కలర్ ను పెంచుతుంది.తేనె చర్మానికి చక్కని గ్లో ను అందిస్తుంది.
టిప్ 3:
ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, మూడు టేబుల్ స్పూన్లు పాలు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఆరపెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఈ మాస్క్ చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా మారుస్తుంది.