మన డేలో ఫస్ట్ మీల్ బ్రేక్ ఫాస్ట్.సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఏది పడితే అది తినేస్తుంటారు.
కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే చూస్తుంటారు.కానీ మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మన రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
ఈ నేపథ్యంలోనే బ్రేక్ ఫాస్ట్ లో ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు.
లంచ్, డిన్నర్ లోనే కాకుండా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కూడా మాంసాహారం(non-vegetarian) లాగించేస్తుంటారు.కానీ ఉదయం పూట అల్పాహారంలో మాంసాహారం అస్సలు తీసుకోరాదు.
మాంసాహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ మరియు నైట్రేట్స్ వివిధ చర్మ సమస్యలకు కారణం అవుతాయి.

అలాగే కొందరు బ్రేక్ ఫాస్ట్ లో స్వీట్స్ (Sweets)తింటూ ఉంటారు.అయితే ఖాళీ కడుపుతో స్వీట్స్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి.మధుమేహం ఉన్న వారికి ఇది చాలా ముప్పుగా మారుతుంది.
పొద్దు పొద్దున్నే మైదాతో తయారు చేసిన పూరీలు, బోండాలు(puris, bondas) తదితర ఆహారాలను తీసుకోవడం సరైన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు.మైదాలో ఫైబర్ ఉండదు, ఇది మలబద్ధకం, ఉబ్బరం, ప్రేగులలో అసౌకర్యం మరియు ఊబకాయం కలిగిస్తుంది.
మైదాలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఇది టైప్-2 మధుమేహానికి దారి తీస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ లో కారం, మసాలా(masala, spicy) దట్టించిన ఆహారాలు కూడా తీసుకోరాదు.ఇటువంటి ఫుడ్స్ జీర్ణ క్రియ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణం అవుతాయి.
ఇక కొందరు బ్రేక్ ఫాస్ట్ లో ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు.ఈ పానీయాలు ఆకలిని తాత్కాలికంగా అరికట్టగలవు, కానీ అవి సమతుల్య అల్పాహారం అందించే సుదీర్ఘమైన శక్తిని మరియు పోషణను అందించలేవు.







