సినీనటి సాయి పల్లవి( Sai Pallavi ) ప్రస్తుతం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇలా నటన పరంగా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ఈమె త్వరలోనే అమరన్( Amaran ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
మేజర్ ముకుంద్( Major Mukund ) బయోపిక్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్లలో సాయి పల్లవి బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.అయితే గతంలో ఇండియన్ ఆర్మీ( Indian Army ) గురించి సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ ఈమెపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు.అయితే ఈ ట్రోల్స్ గురించి సాయి పల్లవి ఎక్కడ స్పందించలేదని తెలుస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

మీ తండ్రి గారు మీకు ఒక ఆర్మీ ప్రపోజల్ తీసుకొస్తే పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నేను ఆర్మీ జవాన్ ను పెళ్లి చేసుకోవడం కంటే కూడా అక్కడ వైద్యురాలిగా కొనసాగుతూ వారికి సేవలు అందించాలని కోరుకుంటానని తెలిపారు.ఇక ప్రస్తుతం తనకు పెళ్లి ఆలోచనలైతే ఏమాత్రం లేవని ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని సాయి పల్లవి వెల్లడించారు.ఇలా ఈమె మాటలను బట్టి చూస్తే తాను ఆర్మీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని అలా పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పకనే చెప్పేశారు.







