సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj ) ఒకరు.ఈయన అద్భుతమైన నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు.
కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషలలో కూడా నిత్యం సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వార్తలలో నిలిచిన సంగతే తెలిసిందే.
ముఖ్యంగా తిరుపతి లడ్డు( Tirupathi Laddu ) విషయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై ఈయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడటంతో ఈయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఉండక పోవచ్చు అనే కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే తాజాగా ఈ విషయంపై ప్రకాష్ రాజ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సమాజంలో ఏదైనా తప్పు జరిగితే తాను చూస్తూ అసలు ఊరుకోనని తెలిపారు.
తనకు సినిమా అవకాశాలు కోల్పోయిన ప్రశ్నించడం మాత్రం ఆపనని ఈయన వెల్లడించారు.నా కుమారుడు సిద్దు మరణంతో బాధలో కూరుకుపోయాను కానీ నాకంటూ ఓ కుటుంబం ఉంది.
వృత్తి ఉంది.

నాకంటూ మనుషులు ఉన్నారు ఓ జీవితం ఉంది.అందుకే తిరిగి నిలబడ్డాను నా టాలెంట్ చూసి ప్రేక్షకులు నన్ను ఆదరించారు.వారి ప్రేమ వల్లే నేను ఇప్పటికి నటుడిగా కొనసాగుతున్నాను అంటూ ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈయన కేవలం సనాతన ధర్మం గురించి అని మాత్రమే కాదు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల పట్ల లేదా రాజకీయాల పరంగా కానీ పలు విషయాలపై స్పందిస్తూ ముక్కుసూటిగా మాట్లాడటంతో ఈయన తరచూ వార్తలలో నిలుస్తున్నారు.







