సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో కార్పొరేటర్ హెయిర్ సెలూన్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ శుక్రవారం మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మొగరాల వాసు మాట్లాడుతూ పట్టణంలో గత 30 ఏళ్లుగా నాయీబ్రాహ్మణ కుటుంబీకులు వృత్తిపరంగా హెయిర్ సెలూన్లు పెట్టుకొని, వాటిపై ఆధారపడి జీవిస్తున్నమని,తమ వృత్తికి భంగం కలిగించే విధంగా గత కొంతకాలంగా ఇతర కులాలకు చెందిన వారు కార్పొరేటర్ హెయిర్ సెలూన్లను ఏర్పాటు చేయడంతో కులవృత్తిపై ఆధారపడిన తమకు తగినంత పనిలేక ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేటర్ హెయిర్ సెలూన్లను వ్యతిరేకిస్తూ గతంలో పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేశామని, అయినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు.ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ స్పందించి కార్పోరేట్ హెయిల్ సెలూన్లను తొలగించి నాయీ బ్రాహ్మణుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు మొగరాల సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి కాపర్తి శీను, ఉపాధ్యక్షుడు రాచమల్ల కృష్ణ,కార్యదర్శి మేడిపల్లి నాగయ్య,కోశాధికారి పిల్లుట్ల లక్ష్మణ్, వీరస్వామి,ఉదయ్, రాంప్రసాద్,వెంకన్న,శివ,నాగరాజ్,సతీష్,ఉపేందర్,కార్తీక్,నాగరాజు,వీరబాబు తదితరులు పాల్గొన్నారు.