రాజన్న సిరిసిల్ల: 21 వ అఖిల భారత పశు గణన – తెలంగాణ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ 21 వ అఖిల భారత పశు గణన – తెలంగాణ గోడ పత్రికని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
21వ అఖిల భారత పశు గణన 25 అక్టోబర్ 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించబడుతుందనీ, పశు గణన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ (భారత్ పశుదాన్ పోర్టల్ )లో పశు గణన జరుగుతుందనీ అధికారులు వివరించారు.
ఎన్యూమరేటర్ల పనిని మండల స్థాయిలో సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తారని , దీని కోసం ఆ మండలానికి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌లకు బాధ్యతలు అప్పగిస్తున్నమన్నారు .జిల్లా స్థాయిలో జిల్లా నోడెల్ అధికారి పర్యవేక్షిస్తారన్నారు.
పశు గణన ద్వారా పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, మరిన్నింటితో సహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పశువులు, కోళ్ల సంఖ్యను గణన లెక్కిస్తుందన్నారు.ఇది పశువుల వయస్సు, లింగం మరియు జాతికి సంబంధించిన డేటాను కూడా సేకరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి , ఈ.డి.ఎస్సి కార్పొరేషన్ స్వప్న , పశు వైద్య అధికారులు పాల్గొన్నారు.