చిన్నారితో స్కూటర్‌ రైడ్ చేయించిన తండ్రి.. అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్!

ఇటీవల కాలంలో మైనర్లు రోడ్ల మీద వాహనాలు తోలేస్తూ చాలామందికి భయం కలిగిస్తున్నారు.తల్లిదండ్రుల నిర్లక్ష్యం, చెడు పెంపకం వల్లే వీరు ఇలా తయారవుతున్నారు అంటూ చాలామంది తిట్టిపోస్తున్నారు.

 Viral Video Little Girl Rides Scooter With No Helmet While Father Sits Back Deta-TeluguStop.com

తాజాగా ఇలాంటి ఒక తండ్రి ( Father ) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఒక అమ్మాయి స్కూల్‌కు తీసుకెళ్లేటప్పుడు ఆమె తండ్రి ఓ తప్పు చేశాడు.

అదేంటంటే ఆ బాలికకు స్కూటర్‌( Scooter ) హ్యాండిల్ పూర్తిగా ఇచ్చేసి హాయిగా వెనుక కూర్చున్నాడు.ఈ వీడియోని కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.

అది చూసి ఆ అమ్మాయి( Girl ) హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటర్ నడుపుతున్నందుకు చాలా మంది ఆందోళన చెందారు.చిన్న పిల్లలు స్కూటర్లు నడపడం ప్రమాదకరమని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి ఎందుకు జాగ్రత్త తీసుకోవడం లేదని ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు.మహారాష్ట్రలో( Maharashtra ) ఈ వీడియో షూట్ చేసినట్లుగా తెలుస్తోంది.ఈ క్లిప్‌ను “ఛత్రపతి సంభాజినగర్( Chhatrapati Sambhajinagar ) నుంచి షాకింగ్ దృశ్యాలు” అని క్యాప్షన్ రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఈ వీడియో చూసిన వారు, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకరు, “హెల్మెట్ ఎక్కడ సార్? మీరు పెట్టుకోలేదు, మీ కూతురికి తొడగలేదు.” అని కామెంట్ చేశారు.

ఆ అమ్మాయి తండ్రిని అరెస్ట్ చేయాలి” అని ఒకరు కామెంట్ చేశారు.మరొకరు, “ఇలాంటివి జరుగుతున్నందుకే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇది ఏ రకమైన తల్లిదండ్రుల బాధ్యత?” అని అన్నారు.“అమ్మాయిని తప్పు పెట్టడం లేదు కానీ, తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి” అని మరొకరు కామెంట్ చేశారు.“అమ్మాయి చాలా బాగా స్కూటర్ నడుపుతుంది.కానీ ఆ వయసులో స్కూటర్ నడపడం చాలా ప్రమాదకరం, తల్లిదండ్రులు దీని గురించి జాగ్రత్తగా ఉండాలి” అని మరొకరు కామెంట్ చేశారు.

తండ్రికి స్కూటర్ పై పూర్తి కంట్రోల్ ఉంది, అమ్మాయిని కాసేపు ఎంజాయ్ చేయనివ్వడమే” అని కొంతమంది అన్నారు.“ఇంత సోషల్ మీడియా డ్రామా అవసరం లేదు” అని ఒకరు అన్నారు.ఈ వీడియోకు ఇప్పటికే 45 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube