2023 లో టాలీవుడ్ హీరో తారకరత్న(Taraka Ratna) మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే.తెలుగుదేశం పార్టీ ప్రచార పాదయాత్రలో భాగంగా అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో మృతి చెందిన సంఘటన అందరికి తెలిసిందే.
అయితే తారకరత్న మరణం అనంతరం అతని భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తారకరత్నను తలుచుకుంటూ పోస్ట్లు చేస్తూ తన భావలను వ్యక్తం చేసేది.అంతేకాకుండా తన పిల్లలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే పోస్ట్ చేసేది.
ఈ క్రమంలో తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి )(Alekhya Reddy) ఇంస్టాగ్రామ్ వేదికగా తన పెద్ద కూతురు నిష్క సంబంధించి హాఫ్ శారీ ఫంక్షన్(Half sharry function) అయ్యిందంటూ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.ఈ వేడుకలలో తారకరత్న ఫోటో పెట్టి ఆయనకు నివాళులు కూడా అర్పించారు.ఈ కార్యక్రమంలో అలేఖ్య రెడ్డి పెదనాన్న ఆయన వైసిపి నేత విజయసాయి రెడ్డితో(Vijaya Sai Reddy) పాటు పలువురు నేతలు, బంధుమిత్రులు అందరూ కూడా హాజరయ్యారు.
ఇది ఇలా ఉండగా.మరోవైపు హాఫ్ శారీ ఫంక్షన్ కు నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family)మాత్రం దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి నందమూరి ఫ్యాన్స్, తారక రత్న ఫ్యాన్స్ అతన్ని తలుచుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.