ఎంతటి గొప్ప ఎంటర్టైన్మెంట్ షో అయినప్పటికీ, ఒక్కసారి రియాలిటీకి మించిన ఊహలు చేస్తే పట్టుదప్పుతుంది.అత్యాశకి పోయి లేనిపోని గాసిప్స్ దుమారం రేగితే మాత్రం సగటు ప్రేక్షకుడే పెదవి విరుస్తాడు.
ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8( Telugu Bigg Boss Season 8 ) పరిస్థితి అదే అంటున్నారు విశ్లేషకులు.అవును, హఠాత్తుగా గంగవ్వకు రాత్రి గుండెపోటు వచ్చింది.
దాంతో డాక్టర్లు హుటాహుటిన హౌజులోకి వెళ్లి చికిత్స అందించారు కూడా.దాంతో గంగవ్వ అభిమానులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు.
ఇక సహ కంటెస్టెంట్ విష్ణుప్రియ గురించి చెప్పాల్సిన పనిలేదు.తెగ టెన్షన్ పడిపోతూ… గంగవ్వ, గంగవ్వ అని దారుణంగా బాధపడింది.
కట్ చేస్తే అదంతా ప్రాంక్ అట అని మళ్లీ ప్రచారం నడిచింది.దాంతో వీక్షకులు చాలా అసహనానికి లోనయ్యారు.
అసలే ముదుసలి అయినటువంటి గంగవ్వ( Gangavva )ని తీసుకొచ్చి మరలా మరలా ఆడించడం అనేది పెద్ద రిస్క్.ఆ రిస్క్ చేసిన బిగ్‌బాస్ ఇలాంటి ఫాల్త్ ప్రాంక్స్ చేస్తే జనాలు నొచ్చుకొరూ? అంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే బిగ్‌బాస్ గేమ్ షో పట్టుదప్పి ఎటుపోతుందో అస్సలు అర్ధం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.మరోవైపు వీక్షకులు కూడా రోజురోజుకీ ఈ షో పట్ల నిర్లిప్తత కనుబరుస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఇవన్నీ కాసేపు పక్కనబెడితే, ఈసారి నిఖిల్, పృథ్వి, మెహబూబ్‌ల మీద హౌజులో బాగా వ్యతిరేకత కనిపించింది.చివరకు నామినేషన్ల జాబితాలో వాళ్లతోపాటు నయని పావని, విష్ణుప్రియ, ప్రేరణ ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.అవినాష్ అయితే సుదీర్ఘమైన వాదనలతో షో ఆద్యంతం బాగా బోర్ కొట్టించాడు.కొందరికైతే నామినేట్ చేయడానికి సరైన కారణాలే కనబడలేదు.ఈ క్రమంలోనే రోజురోజుకూ షో నిస్సారంగా తయారవుతోంది అంటూ సగటు ప్రేక్షకుడు అంటున్నాడు.ఇక మీరు ఈ షోని తాజాగా చూసినట్లైతే మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అంతేకాకుండా, బిగ్‌బాస్ గేమ్ షో వలన యువత ఎలా ప్రభావితం అవుతున్నారో కూడా ఇక్కడ మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి.