తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ 2024 ఫలితాలు( DSC 2024 Results ) కొన్ని రోజుల క్రితం వెల్లడవగా డీఎస్సీ సాధించిన వ్యక్తులు సక్సెస్ స్టోరీలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఎంతోమంది పేదింటి విద్యార్థులు డీఎస్సీని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సులువుగా సాధించారు.
అలా డీఎస్సీ పరీక్షతో లక్ష్యాన్ని సాధించిన యువతులలో స్వప్న ఒకరు.స్వప్న( Swapna ) తండ్రి పేరు సత్యారెడ్డి కాగా మక్తల్ మండలంలోని జక్లేర్ ఈ యువతి స్వగ్రామం.
స్వప్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి బీఎడ్ చేసి డీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు.భర్త, అత్తమ్మ సహకారాంతో రాత్రి 12 గంటల వరకు డీఎస్సీ ప్రిపేర్ అయ్యానని ఆమె చెబుతున్నారు.ఆన్ లైన్ యాప్స్ సహాయంతో డీఎస్సీ ప్రిపేర్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. నారాయణపేట జిల్లా( Narayanpet ) స్థాయిలో మ్యాథ్స్ లో 87.33 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించానని స్వప్న చెబుతున్నారు.స్వప్న సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
పేదింటి బిడ్డ అయిన స్వప్న తన సక్సెస్ తో నేటి తరం ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.స్వప్న టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.మ్యాథ్స్ లో స్టేట్ ఫస్ట్ రావడం సులువైన విషయం అయితే కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.స్వప్న ఎంతో కష్టపడటం వల్లే ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాధించారని చెప్పవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో స్వప్న మాత్రం తన సక్సెస్ తో ఎన్నో మెట్లు పైకి ఎక్కారనే చెప్పాలి.స్వప్నకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆమెకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులను కూడా నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడితే ఆలస్యంగానైనా కచ్చితంగా శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కడం పక్కా అని స్వప్న సక్సెస్ స్టోరీతో మరోసారి ప్రూవ్ అయింది.