రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా యువమోర్చా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా యువ మోర్చా మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ( Jitender Reddy )మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి తెలంగాణలో హిందువులపై హిందూ దేవత విగ్రహాలపై దాడులు చేస్తూ విగ్రహాలను తన్నుతూ హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారని అన్నారు.
కొన్ని సంవత్సరాలుగా ఇతర వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.సికింద్రాబాద్లో ముత్యాలమ్మ దేవాలయంపై దాడినీ నిరసిస్తూ మండల కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సి ఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) ముత్యాలమ్మ దేవాలయంపై దాడిచేసిన దోషులను కఠినాతి కఠినంగా శిక్షించి తెలంగాణ రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా చూడాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి హిందూ సమాజం తగిన గుణపాఠం చెప్తుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మార్పు దయాకర్ రెడ్డి, వంగల సనత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







