కమలా హారిస్ ఇంటర్వ్యూని ఎడిట్ చేశారు .. అమెరికన్ ఛానెల్‌పై ట్రంప్ ఆరోపణలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US presidential election ) హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.మరో 15 రోజుల్లో అగ్రరాజ్యంలో ఎన్నికలు జరగనున్నాయి.

 Donald Trump Asks Cbs News To Release Unedited 60 Minutes Kamala Harris's Interv-TeluguStop.com

ఈ తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మద్ధతు కూడగట్టాలని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి.డెమొక్రాట్ అభ్యర్ధి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య మాటల యుద్దం తారాస్థాయిలో జరుగుతోంది.

ఇటీవల సీబీఎస్ న్యూస్ ప్రసారం చేసిన కమలా హారిస్ ఇంటర్వ్యూపై ట్రంప్ ఆరోపణలు చేశారు.ఆ ఇంటర్వ్యూ‌ను ఎడిట్ చేసి టెలికాస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.

Telugu Minutes, Cbs, Donald Trump, Google, Kamalaharris, Presidential-Telugu NRI

ఒరిజినల్ ఇంటర్వ్యూని ప్రసారం చేయాలని లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని ట్రంప్ హెచ్చరించారు.దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా రెండు రకాలుగా ఇంటర్వ్యూని మార్చేశారని ఆయన ఆరోపించారు.ప్రసార మాధ్యమాల చరిత్రలో ఇది అతిపెద్ద మోసమని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఫ్లాట్‌ఫాంలో ఓ పోస్ట్ పెట్టారు.కమహా హారిస్‌( Kamala Harris )ను రక్షించడానికి సీబీఎస్ న్యూస్ చేసిన మార్పును తెలుసుకునే హక్కు అమెరికా ప్రజలకు ఉందని ఆయన పేర్కొన్నారు.

అయితే ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను సీబీఎస్ న్యూస్ తోసిపుచ్చింది.అయితే ట్రంప్( Donald Trump ) ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు.ఇప్పటికే టెక్ దిగ్గజం గూగుల్‌పై ఆయన కొద్దిరోజుల క్రితం విరుచుకుపడ్డారు.ఎన్నికలకు సంబంధించి కేవలం కమలకు చెందిన మంచి కథనాలు ట్రెండ్ అయ్యేలా గూగుల్ పక్షపాతం చూపిస్తోందని ట్రంప్ ఆరోపించారు.

తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ వ్యవహారంపై న్యాయశాఖతో విచారణ జరిపిస్తానని ఆయన హెచ్చరించారు.

Telugu Minutes, Cbs, Donald Trump, Google, Kamalaharris, Presidential-Telugu NRI

అలాగే తనకు సంబంధించిన బ్యాడ్ కంటెంట్‌ డిస్‌ప్లే అయ్యే విధంగా ఓ వ్యవస్ధను గూగుల్ చట్టవిరుద్దంగా ఉపయోగించిందని ట్రంప్ ఆరోపించారు.ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధమైన చర్య అని.ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు న్యాయశాఖ వారిని విచారిస్తుందని ఆయన ఆకాంక్షించారు.లేనిపక్షంలో అమెరికన్ చట్టాలకు లోబడి.తాను గెలిచిన వెంటనే గూగుల్‌పై ప్రాసిక్యూషన్‌కు అభ్యర్ధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube