రామన్నపేట ప్రాంతాన్ని ఎడారిగా మార్చొద్దు: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం(Kommaigudem) గ్రామంలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్(BRS) పార్టీ పూర్తి వ్యతిరేకమని,ప్రజల “ఆరోగ్యమే ముద్దు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు” అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah) అన్నారు.సోమవారం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ గేటు వద్ద బీఆర్ఎస్ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

 Don't Turn Ramannapet Area Into A Desert: Mla Chirumurthy Lingayah, Ramannapet,-TeluguStop.com

అనంతరం రామన్నపేట తహసిల్దార్ కార్యాలయంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చవద్దని,పర్యావరణాన్ని పరిరక్షించి,ప్రజల జీవితాలను కాపాడాలని, వృత్తి సంఘాలకు ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల భవిష్యత్తులో హాని ఉందని,గౌడ,చేనేత వర్తక సంఘాలకు ప్రతి ఒక్కరికి అంబుజా ఫ్యాక్టరీ (Ambuja Factory)నిర్మించడం వల్ల అనారోగ్య బారినపడే అవకాశం ఉన్నదన్నారు.మాయమాటలు చెప్పి రైతులను వలలో వేసుకుని సుమారుగా 360 ఎకరాల భూమిని సేకరించి,ఇనాంభూములు కబ్జా చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని,సుమారుగా ఈ కంపెనీ ఏర్పాటు వల్ల 40 గ్రామాలు ముప్పు ప్రాంతంగా అనారోగ్య బారిన పడుతున్నాయని, నీరు,వాయు కాలుష్యం ఏర్పడుతుందన్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి కార్పొరేట్ వ్యవస్థలకు సహకరించకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరారు.ప్రభుత్వం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చిన పర్మిషన్లను వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో ప్రజాభిప్రాయం మేరకు ప్రజల ఆరోగ్యరీత్యా ఆందోళన కార్యక్రమాలు భారీ ఎత్తున చేపడతామని హెచ్చరించారు.

ఈ నెల 23 బుధవారం జరిగే ప్రజా అభిప్రాయ సేకరణను అడ్డుకుంటామన్నారు.గ్రామ గ్రామం నుండి వేలాదిగా తరలివచ్చి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా నిరసన తెలియజేసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube