పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు,వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శ.అమరుల త్యాగాలు,ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని,ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అన్నారు.

 Collector Sandeep Kumar Jha Sp Akhil Mahajan At Police Flag Day, Collector Sande-TeluguStop.com

జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపెట గ్రామ శివారులో గల అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు,పోలీస్ అధికారులతో కలసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 08 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని,వారి త్యాగ ఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని,పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇట్టి కార్యక్రమానికి హాజరైన త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించిన కలెక్టర్,ఎస్పి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని,ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు.

అక్టోబర్ 21 నుంచి 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని , అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు.

అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు.దేశ సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో పహార కాస్తున్న 10 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను 1959లో ఇదే రోజున చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని, అప్పటినుండి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు.

విధి నిర్వహణ సందర్భంగా ఎన్నో జటిలమైన సవాళ్లు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఈసంవత్సరంలో తీవ్రవాదులు,సంఘ విద్రోహక శక్తుల్లో 214 మంది పోలీసులు అమరులయ్యారనీ,వారి త్యాగాలను స్మరించుకుంటూ వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమం, వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లభింపచేయడం,అయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి పేర్కొన్నారు.

పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 31 తేదీ వరకు రక్తదాన శిబిరాలు,సైకిల్ ర్యాలీ,క్యాండిల్ ర్యాలీ,2k రన్,ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, ఫోటో, వీడియో పోటీలు నిర్వహించడం జరుగుతుందని,పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ మురళి కృష్ణ, సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube