వృత్తి, ఉద్యోగ , వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ అత్యున్నత స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రత్యేకించి రాజకీయాల్లో మనవారు కీలకపాత్ర పోషిస్తున్నారు.
మేయర్లు, సెనేటర్లు, ఎంపీలు, మంత్రులు, ప్రధానులు, అధ్యక్షులుగా రాణిస్తున్నారు.నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు భారత సంతతికి చెందిన కమలా హారిస్.
( Kamala Harris ) ఆమె కనుక ఆ ఎన్నికల్లో గెలిస్తే.అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించిన తొలి భారత సంతతి మహిళగా, తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.
ప్రస్తుతం అమెరికాలో వెలువడుతున్న పలు సర్వేల్లో కమల ముందంజలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా కెనడాలోని బ్రిటీష్ కొలంబియా( British Columbia ) ప్రావిన్స్‌లో జరిగిన ఎన్నికల్లో 13 మంది భారత సంతతి అభ్యర్ధులు గెలపొంది కెనడియన్ రాజకీయాల్లో ఇండియన్ కమ్యూనిటీ ఆధిపత్యాన్ని మరోసారి రుజువుచేశారు.గెలుపొందిన వారిలో అత్యధికులు పంజాబీ మూలాలున్న వారే కావడం గమనార్హం.బ్రిటీష్ కొలంబియాలో ఇండో కెనడియన్ జనాభా విస్తరించి ఉంది.93 మంది సభ్యులున్న సభలో జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) సారథ్యంలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) 46, కన్జర్వేటివ్ పార్టీ 45, గ్రీన్ పార్టీ రెండు స్థానాల్లోనూ విజయం సాధించాయి.గెలుపొందిన భారత సంతతి నేతల్లో అత్యధికులు ఎన్డీపీ, కన్జర్వేటివ్ పార్టీలకు చెందినవారే.
విజేతలలో రవి కహ్లోన్,( Ravi Kahlon ) రాజ్ చౌహాన్,( Raj Chauhan ) జగ్రూప్ బ్రార్,( Jagrup Brar ) మన్‌దీప్ ధాలివాల్, రవి పర్మార్, సునీతా ధీర్, రేహ్ అరోరా, హర్విందర్ కౌర్ సంధు, నిక్కీ శర్మ, జెస్సీ సన్నర్, హర్మన్ సింగ్ భంగు, హోన్వీర్ సింగ్ రంధావా, టోడీ టూర్ ఉన్నారు.పరాజయం పాలైన వారిలో విద్య, శిశు సంరక్షణ శాఖ మంత్రి రచనా సింగ్, పంజాబీ నేత జిన్నీ సిమ్స్ వంటి నేతలున్నారు.జగ్రూప్ బ్రార్ సర్రే ఫ్లీట్ వుడ్ నుంచి ఏడోసారి విజయం సాధించడం విశేషం.పంజాబ్‌లోని బటిండాలో జన్మించిన బ్రార్ ఒకప్పుడు భారత జాతీయ బాస్కెట్ బాల్ జట్టులో సభ్యుడు.ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన ఆయన అక్కడే స్థిరపడిపోయారు.2004 నుంచి కెనడా రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.