1947 ఆగస్టు 15న భారతదేశం( India ) బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశమైంది.అదే సమయంలో పాకిస్థాన్( Pakistan ) అనే కొత్త దేశం కూడా ఏర్పడింది.
ఒకే దేశంగా ఉండే భారతదేశాన్ని రెండు దేశాలుగా విభజించడం చాలా కష్టమైన పని.ఈ విభజన సమయంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి.వాటిలో చాలా ముఖ్యమైన సమస్య – కరెన్సీ.( Currency ) విభజన తర్వాత కొత్త దేశంగా ఏర్పడిన పాకిస్థాన్‌కు తన సొంత కరెన్సీని ముద్రించడానికి కొంత సమయం పట్టింది.

అందుకే ఇండియా దయతో పాకిస్థాన్‌లో కొంతకాలం తన దేశపు నోట్లను ఉపయోగించుకోవడానికి అనుమతించింది.కానీ ఈ నోట్లపై “పాకిస్థాన్ ప్రభుత్వం” అని ముద్రించారు.దీని వల్ల ఈ నోట్లు పాకిస్థాన్‌లో చట్టబద్ధమైన చెల్లింపుగా మారాయి.దాదాపు ఒక సంవత్సరం పాటు పాకిస్థాన్ వాసులు భారతదేశం ముద్రించిన ఈ నోట్లనే ఉపయోగించారు.1947లో భారతదేశం ఉపయోగిస్తున్న 5 రూపాయల నోట్లపై( Five Rupees Note ) సైతం ‘పాకిస్థాన్ ప్రభుత్వం’ అని ముద్రించి, ఆ నోట్లను పాకిస్థాన్‌లో కూడా వాడారు.ఆ సమయంలో భారత రిజర్వ్ బ్యాంక్( Reserve Bank Of India ) రెండు దేశాలకు కూడా కేంద్ర బ్యాంక్‌గా పనిచేసింది.
కొంతకాలం తర్వాత పాకిస్థాన్ తనదైన కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేసింది.

ఇప్పుడు ఈ 5 రూపాయల నోటు చాలా అరుదుగా లభిస్తుంది.అందుకే ఇది కలెక్టర్లలో ఎంతో ప్రాచుర్యం పొందింది.ఈ నోటు గురించి రెడిట్‌లో చాలా మంది చర్చిస్తున్నారు.
భారతదేశంలో స్వాతంత్రం రాకముందు 5 రూపాయల నోటుపై బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ VI( King George VI ) ఫొటో ఉండేది.స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఆయన ఫొటోతోనే నోట్లు వచ్చాయి.
భారతదేశం స్వతంత్ర దేశమైన తర్వాత కూడా కొత్త నోట్లను ముద్రించడానికి కొంత సమయం పట్టింది.స్వాతంత్రం వచ్చినా కూడా భారతదేశంలో కొన్ని చట్టాలు ఇంకా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నవే.అందుకే కింగ్ జార్జ్ VI ఫొటోతో నోట్లు వచ్చాయి.
https://www.reddit.com/r/india/comments/1g6lo7p/indian_rupees_stamped_with_government_of_pakistan/?utm_source=share&utm_medium=mweb3x&utm_name=mweb3xcss&utm_term=1&utm_content=share_button ఈ లింక్‌పై క్లిక్ చేసి ఆ నోటు చూడవచ్చు.