రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా విర్ణపల్లి మండలం లాల్ సింగ్ తండా, వన్పల్లి, ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
వరి కొనుగోలు మరియు లోడింగ్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు అలస్యం జరగకుండా ట్యాబ్ ఎంట్రీలు జరగాలని తెలిపారు.కొనుగోలు కేంద్రాలకు దాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సజావుగా కొనుగోలు ప్రకీయా పూర్తి చేయాలని, రైతులకు ఇబ్బందులు గురిచేసిన వారు చర్యలకు బాద్యులవుతారని హెచ్చరించారు.
వాతావరణంలో మార్పులు అకాల వర్షాబావ పరీస్థితులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోని, దాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసమే సెంటర్లను స్వయంగా తనిఖీ చేసి వెంటనే పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతుల ద్వారా కొనుగోలు కేంద్రాలకు వచ్చే దాన్యం నాణ్యత పరిమాణాలను, తేమశాతం పరిశీలించి, వ్యవసాయ శాఖ అధికారుల దృవీకరించిన దాన్యాన్ని, టోకెన్ పద్ధతి ప్రకారం మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర నిర్వహకులను, అధికారులను ఆదేశించారు.నాణ్యత ప్రమాణాలను ఏ విధంగా పాటిస్తూన్నారు, ఎంత విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలును వెంటనే తరలించాలని, తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, పిడి డిఆర్డిఎ శేషాద్రి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సెంటర్ నిర్వాహకులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.