బిగ్‌బాస్ సీజన్ 8( Bigg Boss Season 8 ) అట్టర్ ఫ్లాప్ అయ్యేలాగానే ఉందని రీసెంట్ టీఆర్‌పీ రేటింగ్స్( TRP Ratings ) చూస్తుంటే స్పష్టమవుతోంది.కొత్త కంటెస్టెంట్లను తీసుకొచ్చినా, హుషారైన పాత కంటెస్టెంట్లను ప్రవేశపెట్టినా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోతోంది.
ఎంతో ఖర్చుతో గ్రాండ్‌గా ఎపిసోడ్స్ రన్ చేస్తున్నా బిగ్‌బాస్ చూసేందుకు ఎక్కువగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.రేటింగ్స్ పెరగడం లేదు.
సీజన్ 7 లాగే ఇదీ ఓవరాల్‌గా ఫ్లాప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం హౌజులో 8 మంది పాతవాళ్లు, మరో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వచ్చిన వారు ఉన్నారు.వీరి ఎంట్రీలకు సంబంధించిన దృశ్యాలను రీలోడ్ పేరిట ఆరో తేదీన స్పెషల్ ఈవెంట్‌గా నిర్వహించారు.ఆ ఎపిసోడ్ రన్ టైమ్ అక్షరాలా మూడున్నర గంటలు.
అయినా సరే రేటింగులు పెద్దగా రాలేదు.హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఆరులోపే రేటింగ్ వచ్చింది.
శనివారం వీకెండ్ షో రేటింగ్స్ ఐదు కంటే తక్కువకే పడిపోయాయి.మిగతా రోజుల్లో 3.5 నుంచి 4 వరకు రేటింగ్స్ పతనమయ్యాయి.దసరా స్పెషల్ ఎపిసోడ్‌కి రేటింగ్స్ ఎలా వస్తాయో చూడాలి.
కానీ మామూలు సమయంలో ఈ టీఆర్‌పీ రేటింగ్స్ ఇలా పడిపోవడం చూస్తుంటే ప్రేక్షకులకు దీనిపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది.
ఈ రియాలిటీ షో 21కు పైగా టీఆర్‌పీ రేటింగ్స్ రాబట్టిన సందర్భాలు ఉన్నాయి.ఆ స్థాయి నుంచి 3.5 రేటింగ్స్‌ల స్థాయికి పడిపోవడం బాధాకరమే.బహుశా బిగ్‌బాస్ తెలుగు షో చరిత్రలో మరీ ఇంత తక్కువగా రేటింగ్స్ వచ్చి ఉండవు.సరైన కంటెస్టెంట్లు లేకపోవడం, ఏ క్రియేటివిటీ లేకుండా పాత గేమ్స్, పాత టాస్కులు పెట్టడం వల్ల ప్రేక్షకులకు విరక్తి వచ్చేస్తోంది.
నయని పావని, మణికంఠ, గౌతమ్ కృష్ణ, పృథ్వి లాంటి క్యారెక్టర్ల వల్ల ఈసారి సీజన్ చూడడానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదు.వీళ్లు మంచి కంటెస్టెంట్ అయిన ప్రేరణను( Prerana ) టార్గెట్ చేసి మరింత చిరాకు పుట్టిస్తున్నారు.
గౌతమ్ కృష్ణ( Gautam Krishna ) లాజిక్ లేకుండా ఆవేశంతో అరుస్తుంటాడు.ఓసారి అకారణంగానే మైక్ విసిరేశాడు.రీసెంట్ టాస్కులో కూడా నేను హౌజ్ నుంచి వెళ్లిపోతా అని అరుస్తూ పిచ్చివాడి లాగా ప్రవర్తించాడు.అవినాష్,( Avinash ) రోహిణి( Rohini ) మాత్రం మంచిగా ఆట ఆడుతున్నారు.
ఫన్, ఎంటర్‌టెయిన్‌మెంట్ అందిస్తున్నారు.హరితేజ ఎందుకో కావలసిన వినోదాన్ని అందించలేకపోతోంది.
గంగవ్వకు ఈ షోకు ఫిట్ కాదు, ఆమెను ఎందుకు తెచ్చారో వాళ్లకే తెలియాలి.విష్ణుప్రియ కూడా హోప్ లెస్.
మణికంఠ మొదట్లో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించినా రీసెంట్ టైంలో మాత్రం అవినాష్ టీమ్ వలలో పడకుండా జాగ్రత్త పడ్డాడు.కోవర్టుగా మారడానికి ఒప్పుకోను అంటూ తన తెలివిని ప్రదర్శించాడు.
కానీ ఓవరాల్‌గా చూస్తే ఈసారి సీజన్ ప్రేక్షకులను అస్సలు మెప్పించలేకపోతోంది.అందుకే చాలా పూర్ గా రెస్పాన్స్ వస్తోంది.