చిరంజీవితో చేయాల్సిన సినిమాను వెంకటేష్ తో చేయబోతున్న స్టార్ డైరెక్టర్...

ప్రస్తుతం వెంకటేష్ , అనిల్ రావిపూడి( Venkatesh, Anil Ravipudi ) డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే ఆయన దర్శకత్వంలో చేసిన సైంధవ్ సినిమా( Saindhav movie ) ఫ్లాప్ అయింది.

 The Star Director Who Is Going To Make A Film With Venkatesh Who Is Going To Mak-TeluguStop.com

ఇక దాంతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి కి అవకాశాన్ని ఇచ్చాడు.ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన వెంకీ కుడుముల ( Venky Kudumula )దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

 The Star Director Who Is Going To Make A Film With Venkatesh Who Is Going To Mak-TeluguStop.com
Telugu Anil Ravipudi, Chiranjeevi, Robin Hood, Saindhav, Venkatesh, Venky Kudumu

ప్రస్తుతం వెంకీ కుడుముల నితిన్ ను హీరోగా పెట్టి ‘రాబిన్ హుడ్’ ( Robin Hood )అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో భీష్మ అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అయింది.ఇక అదే కాంబోలో వస్తున్న ‘రాబిన్ హుడ్’ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే కాన్ఫిడెంట్ తో వెంకి కుడుముల ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత వెంకటేష్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి వెంకీ కుడుముల సన్నాహలు చేస్తున్నాడు.ఇక వెంకటేష్ కామెడీని పండించడంలో సిద్ధహస్తుడు.కాబట్టి వెంకీ కుడుముల సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గా సాగుతూ ఉంటుంది.

Telugu Anil Ravipudi, Chiranjeevi, Robin Hood, Saindhav, Venkatesh, Venky Kudumu

కాబట్టి వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా చాలా వరకు వర్క్ అవుట్ అవుతుందనే చెప్పాలి.మరి ఈ ఇద్దరు కలిసి చేయబోతున్న ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది.ఆ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక మొత్తానికైతే చిరంజీవితో చేయాల్సిన సినిమానే వెంకీ కుడుముల వెంకటేష్ తో చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

గతంలో ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.చిరంజీవి కూడా తనకు అవకాశం ఇస్తున్నట్టుగా పలు సందర్భాల్లో హింట్ అయితే ఇచ్చాడు.కానీ ఫైనల్ గా అతనికి హ్యాండ్ ఇచ్చాడు.దాంతో వెంకటేష్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube