యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాజన్న ఆలయ అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తాం ఆలయానికి బంగారు తాపడం, వెండితో బయట పల్లకి ఉత్సవమూర్తుల తయారీకి ప్రణాళికలు రాజన్న సన్నిధిలో మంత్రి మనవడి పుట్టి వెంట్రుకల కార్యక్రమం వేములవాడ ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని కుటుంబ సభ్యుల తో దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ రాజన్న సిరిసిల్ల జిల్లా: యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.సోమవారం వేములవాడ పట్టణంలో పర్యటించిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ , ఎస్పీ అఖిల్ మహజన్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

 Actions For The Development Of Vemulawada Temple On The Yadadri Style , Departme-TeluguStop.com

అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.వేములవాడ రాజన్న ఆలయం అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఆలయంలోకి స్వాగతం పలికారు.

వేద పండితుల ఆశీర్వాదం మధ్యలో మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని కోడే మొక్కలు చెల్లించారు.రాజన్న దేవాలయం సన్నిధిలో మనవడి పుట్టి వెంట్రుకల కార్యక్రమాన్ని మంత్రి కుటుంబ సభ్యుల తో పూర్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాజన్న దేవాలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలోనే రాజన్న దేవాలయ అభివృద్ధి పై సీఎం స్థాయిలో అత్యున్నత సమావేశం జరుగుతుందని, శాస్త్రాల ప్రకారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని రకాల వసతులను కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకున్నామని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని అన్నారు.

యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, యాదాద్రి ఆలయానికి 63 కేజీల బంగారంతో తాపడం ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.వేములవాడ దేవాలయం వద్ద 65 కేజీల బంగారం 5000 కిలోల వెండి అందుబాటులో ఉందని వీటిని వినియోగించుకొని వేములవాడ ఆలయానికి సైతం బంగారు తాపడం, వెండితో పల్లకీలు, ఉత్సవ విగ్రహాలు రూపొందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

అనంతరం మంత్రి బద్ది పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పర్యటనలో మంత్రి వెంట ఆలయ ఈ.ఓ.వినోద్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్, అర్.డి.ఓ.రాజేశ్వర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube