సూర్యాపేట జిల్లా:వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆరాధ్య ఫౌండేషన్ వ్య( Aradhya Foundation )వస్థాపక చైర్మన్ తౌడోజు శ్రీకాంత్ రాజ్( Srikanth Raj) అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రం కిరాణా ఫ్యాన్స్ అసోసియేషన్ భవనంలో సూర్యాపేట విశ్వకర్మ సంక్షేమ సేవా సమితి నాగవల్లి బ్రహ్మయ్య అధ్యక్షతన విశ్వకర్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత వివాహ పరిచయ వేదికకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంతో బిజీగా ఉండేవారు,పేద వారికి ఇలాంటి వేదికలు ఉపయోగపడుతాయన్నారు.
మన విశ్వబ్రాహ్మణులు ఈ వివాహ వేదికను ఉపయోగించుకొని వివాహ సంబంధాలను కుదుర్చుకోవాలన్నారు.పిల్లల ఆలోచన మేరకు పెళ్లి సంబంధాలు సమకూర్చుకుందామని తెలిపారు.
వృత్తిపై ఆధారపడి ఉన్న వారి పిల్లలకు పెండ్లి సంబంధాలు దొరకడం ఇబ్బందికరంగా మారిందన్నారు.ప్రపంచంలోనే తెలివిగలవారు విశ్వబ్రాహ్మణులేనని గుర్తు చేశారు.
విశ్వకర్మ భవనాన్ని నిర్మించుకోవడం కొరకు తన వంతుగా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు.ఎంతమంది విశ్వకర్మ నిరుపేద కుటుంబాలకైనా పెళ్లి సమయంలో తాళిబొట్టు, మెట్టెలు ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నానని, నిరుపేద కుటుంబంలో ఉన్న మహిళల పెండ్లి కొరకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా 90 మంది తమ తమ బయోడేటాను నమోదు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అడ్లూరి రవీంద్రచారి,వీరబ్రహ్మచారి,సీతారామాచారి,రంగు దిలీప్ కుమార్,బాణాల శ్రీనివాస్,లక్ష్మణచారి, పర్వతం శ్రీధర్, పరిపూర్ణాచారి,ఆచారి, అనంతోజు శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.