ఈ మిరాకిల్ ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే హెయిర్ ఫాల్ కు గుడ్ బై చెప్పవచ్చు!

సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్( Hair fall ) అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది.జుట్టు అధికంగా రాలిపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

 This Miracle Oil Helps To Get Rid Hair Fall! Hair Fall, Miracle Oil, Latest News-TeluguStop.com

హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

ఈ ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే హెయిర్ ఫాల్ కు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.మరి ఇంతకీ ఆ మిరాకిల్ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు డ్రై రోజ్‌మేరీ ఆకులు ( Dry rosemary leaves )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి( Clove powder ), రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి( Munagaku powder ), రెండు టేబుల్ స్పూన్లు వేప పొడి( Neem powder ) వేసుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై మూత పెట్టి మూడు నుంచి నాలుగు రోజులు పాటు పక్కన పెట్టేయాలి.

Telugu Care, Care Tips, Oil, Healthy, Latest, Miracle Oil, Fall, Thick, Miracleo

నాలుగు రోజుల అనంతరం క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ మిరాకిల్ ఆయిల్ కురుల ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి తయారు చేసుకున్న ఆయిల్ ను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ రాసుకున్న నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.

Telugu Care, Care Tips, Oil, Healthy, Latest, Miracle Oil, Fall, Thick, Miracleo

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే జుట్టు మూలాల నుంచి బలోపేతం అవుతుంది.కురులకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ ఫాల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది.తెల్ల జుట్టు సమస్య త్వరగా దరి చేరకుండా ఉంటుంది.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యకు గుడ్ బై చెప్పాలని భావించేవారు తప్పకుండా ఈ మిరాకిల్ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube