టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే.ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.
ఇప్పటివరకు ఈ కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది.జానీ మాస్టర్ పై అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తను మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించడంతో మాస్టర్ పై పోక్సో చట్టం( POCSO Act ) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
అదేమిటంటే జానీ మాస్టర్ పై ఎవరైతే లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారో ఇప్పుడు ఆ అమ్మాయి పై రివర్స్ కేసు పడింది.తనను సదరు మహిళా కొరియోగ్రాఫర్( Female Choreographer ) లైంగికంగా వేధించిందంటూ, జానీ మాస్టర్ కు అల్లుడు వరసైన షమీర్( Sameer ) అనే యువకుడు ఆమెపై కేసు పెట్టాడు.జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందని, తన మామ జానీ మాస్టర్ తో కలిసి హైదరాబాద్, చెన్నైలో షూటింగ్స్ కు వెళ్లినప్పుడు ఆమె తనపై లైంగిక దాడి చేసిందని ఆరోపిస్తున్నాడు షమీర్.
ఒకసారి లిఫ్ట్ లో, మరోసారి బాత్రూమ్ లో, ఇంకోసారి లాడ్జిలో ఈ యువకుడిపై సదరు మహిళా కొరియోగ్రాఫర్ అత్యాచారం చేసిందట.నగ్నంగా అతడి ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతోందని వ్యాధిలో తెలిపారు.అంతేకాదు, అదంతా జరిగినప్పుడు తను మైనర్ అని అంటున్నాడు ఇతడు.
మైనర్ గా ఉన్న తనను లైంగికంగా వేధించి, బ్లాక్ మెయిల్ చేసిన మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు యువకుడు.దీంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకున్నట్టయింది.
ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నాడు.మరి ఈ విషయంలో నిజానిజాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
అలాగే ఇంకా ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.