సాధారణంగా ఒక్కోసారి ముఖ చర్మం డల్ గా మారిపోతుంటుంది.కంటి నిండా నిద్ర లేకపోవడం, స్ట్రెస్, ఎండల్లో ఎక్కువగా తిరగడం తదితర కారణాల వల్ల ముఖంలో మెరుపు మాయమవుతుంది.
చాలా నిర్జీవంగా కనిపిస్తుంటుంది.అయితే అటువంటి చర్మాన్ని రిపేర్ చేయడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఉంది.
ఈ రెమెడీతో ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న బంగాళదుంపను( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి ( Besan flour )వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా బంగాళదుంప జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై రెండు ఐస్ క్యూబ్స్ ను తీసుకుని స్కిన్ కు రబ్బింగ్ చేసుకోవాలి.రెండు నిమిషాలు ఈ విధంగా ఐస్ తో రబ్బింగ్ చేసుకుని ఆపై వాటర్ తో ముఖం మరియు మెడను క్లీన్ చేసుకోవాలి.చర్మం నిర్జీవంగా ఉన్నప్పుడు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే.
అది మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుంది.
ఈ రెమెడీ నిమిషాల్లో గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది.డల్ నెస్ ను దూరం చేస్తుంది.చర్మంపై మురికి మృతకణాలను తొలగిస్తుంది.
బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను వదిలిస్తుంది.చర్మం కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
కాబట్టి ఇన్స్టెంట్ గ్లో ను పొందాలని భావించేవారు తప్పకుండా ఈ సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.