అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) నామినేషన్ కోసం పోటీపడిన వారిలో భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) కూడా ఒకరు.ఈ ఏడాది జనవరిలో అయోవా కాకస్‌లలో నాల్గవ స్థానంలో నిలిచిన ఆయన రేసు నుంచి తప్పుకున్నారు.
అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి మద్ధతు లభించకపోవడంతో ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నానని.డొనాల్డ్ ట్రంప్‌కే( Donald Trump ) తన మద్ధతని వివేక్ ప్రకటించారు.
ఆ వెంటనే అట్కిన్సన్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌ను మించి సరైన ఎంపిక లేదన్నారు.
ఈ నేపథ్యంలో రామస్వామిని తన రన్నింగ్ మెట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి)గా ట్రంప్ ఎంపిక చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.
తర్వాత వివేక్ పేరు వార్తల్లో పెద్దగా వినిపించలేదు.అలాంటిది మొన్నామధ్య ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా ఫాంహౌస్‌లో రామస్వామి కనిపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
![Telugu Democratic, Donald Trump, Kamala Harris, Republican, Trump, Trumpvivek, P Telugu Democratic, Donald Trump, Kamala Harris, Republican, Trump, Trumpvivek, P](https://telugustop.com/wp-content/uploads/2024/10/Donald-Trump-hints-Vivek-Ramaswamy-will-have-a-role-in-his-administration-detailsd.jpg)
ఈ క్రమంలో నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential Elections ) గెలిస్తే వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు ట్రంప్ సుముఖంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.బుధవారం పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో ట్రంప్ ప్రసంగిస్తూ.రామస్వామి మొదట్లో తనకు గట్టి పోటీ ఇచ్చారని ప్రశంసించారు.ఆయన తెలివైన వ్యక్తని, నా పరిపాలనలోనూ భాగమవుతాడని ఆకాంక్షిస్తున్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు.ఈ ఏడాది జూన్‌లో విస్కాన్సిన్‌లో జరిగిన ర్యాలీలోనూ మాజీ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
![Telugu Democratic, Donald Trump, Kamala Harris, Republican, Trump, Trumpvivek, P Telugu Democratic, Donald Trump, Kamala Harris, Republican, Trump, Trumpvivek, P](https://telugustop.com/wp-content/uploads/2024/10/Donald-Trump-hints-Vivek-Ramaswamy-will-have-a-role-in-his-administration-detailss.jpg)
కాగా.భారతీయ వలసదారులకు జన్మించారు వివేక్ రామస్వామి.ఈయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్.
తల్లి డాక్టర్.ఈ దంపతులకు రామస్వామి సిన్సినాటిలో జన్మించారు.
హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలలో ఆయన చదువుకున్నారు.ఈయన సంపద విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్లు.
అమెరికాలో విజయవంతమైన బయోటెక్ వ్యవస్థాపకుడిగా వివేక్ రామస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన కంపెనీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఐదు ఔషధాలు సహా పలు మందులను అభివృద్ధి చేసింది.