నక్షబాట,శివాలయం భూములను కాపాడాలని కలెక్టర్ కు విన్నపం

నల్లగొండ జిల్లా:చండూర్ మండలం చామలపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 249లో గల నక్షబాట మరియు పురాతన శివాలయానికి చెందిన భూములను గ్రామానికి చెందిన కట్టేకోల రామేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించి నక్షబాటకు అడ్డంగా గోడ నిర్మాణం చేసి గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

 Request To The Collector To Protect The Lands Of Nakshabata And Shivalayam, Requ-TeluguStop.com

గతంలో 2016లో ఇలాగే నక్షబాటకు అడ్డంగా గోడ నిర్మిస్తే అప్పట్లో గ్రామస్తులు అందరు కలిసి దానిని కూల్చి వేశారని, దానిపై 16 మందిపై కేసులు వేశాడని,మళ్ళీ ఇప్పుడు తిరిగి నక్షబాటకు అడ్డంగా గోడ నిర్మాణం చేస్తున్నాడని, అంతేకాకుండా పురాతన కాలం నుండి వున్న శివాలయానికి సంబందించిన భూములను ఆక్రమించి అమ్ముకోవాలని చూస్తున్నాడని,ఆయన బారి నుండి నక్షబాటను మరియు శివాలయం భూములను కాపాడాలని చామలపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube