టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో శ్రీనువైట్ల ( Srinuwaitla )ఒకరు కాగా గత కొన్నేళ్లుగా శ్రీనువైట్ల సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదనే సంగతి తెలిసిందే.దూకుడు, బాద్ షా సినిమాల తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి.
అయితే విశ్వం సినిమాతో( Vishwam Cinema ) శ్రీనువైట్ల మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలలో విశ్వం మూవీ ఒకటి కాగా ఈ సినిమాతో సక్సెస్ సాధించడం గోపీచంద్ కు కూడా కీలకమని చెప్పవచ్చు.
ఈ మధ్య కాలంలో పలు సినిమాలతో నిరాశపరిచిన గోపీచంద్( Gopichand ) విశ్వంతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.ప్రభాస్ సినిమాలో మాత్రం విలన్ రోల్ ఆఫర్ వస్తే చేస్తానని గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కొసమెరుపు.
కెరీర్ తొలినాళ్లలో విలన్ రోల్స్ లో ఎక్కువగా నటించిన గోపీచంద్ ఆ తర్వాత హీరోగా సక్సెస్ సాధించి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు.విశ్వం సినిమాలో కామెడీ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.విశ్వం ట్రైలర్ లో అటు యాక్షన్ కు ఇటు కామెడీకి పెద్దపీట వేశారు.ట్రైలర్ మరీ అద్భుతంగా లేకపోయినా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించేలా ట్రైలర్ కట్ చేయడం గమనార్హం.
ఈ సినిమా శ్రీనువైట్ల కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే.శ్రీనువైట్ల ఈ సినిమాకు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.విశ్వం సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది.