టాలీవుడ్ హీరో నాగచైతన్య( Naga Chaitanya ) గురించి మనందరికీ తెలిసిందే.నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.
ఇకపోతే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత చాలా కాలం పాటు డిప్రెషన్ లో ఉన్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని ఇటీవలే నాగార్జున బయట పెట్టారు.
ఇక బాధ నుంచి నెమ్మదిగా కోరుకున్న నాగచైతన్య మరో హీరోయిన్ అయినా శోభిత దూళిపాలతో( Sobhita Dhulipala ) ప్రేమలో పడడం ఇటీవలే వారి ఎంగేజ్మెంట్ వేడుక కూడా ముగిసిన విషయం తెలిసిందే.త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు.
అయితే తన నిశ్సితార్ధం( Engagement ) గ్రాండ్ గా జరగాలనే కోరిక, ప్లానింగ్ తనకు లేవని, చైతుతో అందమైన ఆ క్షణాలను ఆస్వాదించాను, అన్ని పద్ధతి, సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ ఎంగేజ్మెంట్ పట్ల తన పేరెంట్స్ హ్యాపీ అని చెప్పిన శోభిత దూళిపాళ్ల తాజాగా చైతు ఎందుకు నచ్చాడో అనే విషయాన్ని రివీల్ చేసింది.ఈ మేరకు నాగ చైతన్య గురించి శోభిత మాట్లాడుతూ.చైతు చాలా మర్యాదస్తుడు, ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు.ఎప్పుడు కూల్ గా ప్రశాంతంగా ఉంటాడు.చైతులోని ఈ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా శోభిత నాగ చైతన్య పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అయితే తనకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదని, అదే తల్లి కావాలనే కోరిక, మాతృత్వంలోని తియ్యదనాన్ని ఆస్వాదించాలని అంటూ శోభిత చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నాగచైతన్య విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో( Thandel ) నటిస్తున్న విషయం తెలిసిందే.సాయి పల్లవి( Sai Pallavi ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.